పుట:KutunbaniyantranaPaddathulu.djvu/206

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 206

శారీరక, మానసిక ఆరోగ్యరక్షణ నిమిత్తమై గర్భస్రావానికి చట్టప్రకారము అనుమతి ఇవ్వడము జరిగింది.

చట్టం ఆమోదించిన కారణాలు

మన దేశములో చట్టప్రకారముగా ప్రత్యేకమైన మూడు పరిస్థితుల్లోనే గర్భస్రావము చేయించుకోవచ్చు. అందులో మొదటిది తల్లి ఆరోగ్యం రక్షణ దృష్ట్యా గర్భస్రావం చేయడము. గుండెజబ్బు వుండటమువల్లగానీ, గుర్రపువాతం రావడంవల్లగానీ, ఇతరత్రా ఏ వ్యాధివల్లగానీ తల్లికి ఆ గర్భము వుండటమువల్ల ప్రాణహాని జరిగేటట్లయితే ఆమెకు తప్పక గర్భస్రావము చేయవచ్చు. పూర్వం చట్టంలోకూడా ఈ సదుపాయం కలిగించడం జరిగింది.

పిండ నిర్మాణంలో లోపం:- కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పుట్టబోయే బిడ్డ శారీరకంగా అవిటివాడుగానూ, మానసికంగా సక్రమంగా లేకుండా ఉండేటట్లయితే, అటువంటిబిడ్డ బాధపడటంకన్నా పుట్టకుండా ఉండటము మంచిది. గర్భస్రావము చేయడం ద్వారా అటువంటి బిడ్డ కలగకుండా చేయడానికి చట్టం అంగీకస్తున్నది. ఉదాహరణకి ఒక స్త్రీ గర్భవతిగా వున్నప్పుడు డీప్ ఎక్స్‌రే ట్రీట్ మెంట్ పొందినట్లయితే గర్భంలో వున్న బిడ్డ అవిటితనముతోనూ, వికృతంగా జన్మించడానికి ఆస్కారం వుంది. అదే విధంగా ఒక స్త్రీ L.S.D. ఎక్కువగా ఉపయోగిస్తూ వుంటే సక్రమ-