పుట:KutunbaniyantranaPaddathulu.djvu/202

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 202

కలుగుతాయి. నాలుగు-ఐదు నెలలు వచ్చిన స్త్రీలల్లో అయితే గర్భస్రావము జరగడానికి ఒక ఇనుపకడ్డీ సన్నటిది తీసుకుని గర్భాశయంలో వుండే ఉమ్మనీరు సంచికి కన్నంపడేటట్లు పొడుస్తారు. ఇంకా కొంతమంది స్త్రీల విషయంలో గర్భస్రావము జరగడానికి ఒక గుండ్రని డబ్బా మూతని ఎర్రగా కాల్చి పొత్తికడుపుమీద వాత గుండ్రముగా తేలేటట్లు పెడతారు. వీటన్నింటివల్ల యెన్నో నష్టాలు, బాధలు వున్నాయి. కాని కడుపువచ్చి వివశురాళ్ళయిన స్త్రీలు ఇవన్నీ గమనించక, వివేకాన్ని కోల్పోయి ఈ అక్రమ పద్దతులు అవలంబించి ప్రాణం మీదికి తెచ్చుకుంటారు.

గర్భవిచ్ఛేదనము కావలసి వచ్చినప్పుడు సరైన పద్దతిలో చేయించుకోకుండా, అక్రమ పద్దతులు అవలంబించినట్లయితే చాలా నష్టాలు సంభవిస్తాయి. ఇష్టము వచ్చినట్లు మంటపుట్టే పదార్దాలు గర్భకోశములోకి నెట్టినట్లయితే ఆ నొప్పికి, మంటకి తట్టుకోలేక షాక్ వచ్చి ప్రాణాపాయం కలుగుతుంది. పుల్లలు కడ్డీలు దూరిపితే గర్భాశయానికి కన్నం పడటము పెరిడోనైటిస్‌లాంటి ప్రమాదకర పరిణామాలు సంభవిస్తాయి. ఇటువంటి గర్భస్రావాలు చేసినప్పుడు బాక్టీరియా క్రిములు తేలికగా గర్భాశయములోకి చేరడం, త్వరితగతిని వ్యాధిక్రిములు వ్యాపించి ఆ స్త్రీ జబ్బుపడటము జరుగుతుంది. దీనివల్ల అమితమైన జ్వరము, షాక్ కలుగుతాయి. అక్రమ పద్దతుల్లో గర్భస్రావము చేయించుకున్న