పుట:KutunbaniyantranaPaddathulu.djvu/187

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 187

పడుతుంది? ఇలాంటి ఆలోచనలెన్నో సునీల్‌లో మెదలసాగాయి.

లీలలోగాని, సునీల్‌లోగానీ, గర్భం, గర్భధారణ గురించి కలిగిన జిజ్ఞాస ఎంతో మెచ్చుకోదగ్గది. వీర్యస్కలనం జరిగినప్పుడల్లా కొన్ని మిలియన్ల వీర్యకణాలు యోని మార్గంలోకి ప్రవేశిస్తాయి. కాని అండంతో ఒక్కటంటే ఒక్కటే వీర్యకణం కలయిక పొందుతుంది. మరి అటువంటప్పుడు ఇన్ని వీర్యకణాల అవసరం ఏమిటనే సందేహం సమంజసమైనదే. కాని అండంతో కలయిక పొందడానికి ఇన్ని వీర్యకణముల అవసరం తప్పక ఉంది. ఎందుకంటారేమో, ఈ వీర్యకణముల హైలూరూనడైజ్ (Hyaloronidase) అనే పదార్ధాన్ని తయారుచేస్తాయి. ఈ పదార్ధం వీర్యకణములకి అండం దరికి చేరడానికి దారి ఏర్పరుస్తుంది. పైగా ముందు అండాన్ని చేరిన వీర్యకణములు తమలో తయారయిన ఈ పదార్ధం ద్వారా అండం వీర్యకణంతో తేలికగా కలయిక పొందడానికి సిద్ధంగాచేసి వుంచుతాయి. తరువాత వచ్చిన వీర్యకణముల్లో ఒకటి తేలికగా అండంతో కలయికపొంది అండాన్ని పిండంగా మార్చివేస్తుంది.

అందుకని వీర్యకణములు ఎంత తక్కువ ఉంటే, హైలూరూనడైజ్ అంత యెక్కువగా లభ్యమై గర్భధారణకు అంత యెక్కువ అవకాశాలు లభ్యమవుతాయి. ఇక్కడ మరొక విషయము గమనించాలి. యోని మార్గంలో-