పుట:KutunbaniyantranaPaddathulu.djvu/186

ఈ పుట ఆమోదించబడ్డది

22. గర్భం ఎలా వస్తుంది ?

లీల నెలతప్పిందని తెలియగానే అందరికీ ఎంతో సంతోషం కలిగింది. ఎందుకంటారేమో దాదాపు ఒక పుష్కరం తరువాత తిరిగి వాళ్ళ యింటిలో పసిపాప కేరింతలు వినబడతాయని, బి.యస్సీ. జంతుశాస్త్రం స్పెషల్ సబ్జక్టుగా పాస్ అయిన లీలలో తాను గర్భవతి కాగానే అనుకోకుండా పిండోత్పత్తి గురించి అనేక ఆలోచనలు రాసాగాయి. జంతువులలో లాగానే తనలో కూడా ఎన్నో మార్పులు కలుగుతూ పిండం పెరుగుతూ వుంటుంది కదా! ఇలా పిండం పెరగడానికి చాలా చిన్నదిగా వుండే గర్భాశయం నెల నెలకి అంత పెద్దదిగా ఎలా పెరుగుతుంది? ఇలా ఎన్నోవిషయాల గురించి ఆసక్తితో కూడిన ఆలోచనలు రాసాగాయి. అంతకంటే మరింత ఎక్కువ జిజ్ఞాసతో లీల భర్త సునీల్ గర్భధారణ ఎలా జరుగుతుందని ఆలోచించసాగాడు. అండంతో సంయోగం పొందడానికి ఒక్క వీర్యకణం చాలు కదా! అన్ని వీర్యకణాలు ఎందుకు? అండంతో వీర్యకణాల కలయిక అండవాహికల్లోనే ఎందుకు జరగాలి? గర్భాశయంలో ఎందుకు జరగకూడదు? ఒకసారి విడుదలయిన వీర్యకణాలు అండంతో కలియడానికి ఎంత సమయం