పుట:KutunbaniyantranaPaddathulu.djvu/182

ఈ పుట ఆమోదించబడ్డది

182

కుటుంబ నియంత్రణ - పద్ధతులు

రజస్వల కాకుండా గర్భం రావచ్చా?

కొంతమంది ఆడపిల్లలు రజస్వల కాకముందే శారీరకంగా మానసికంగా పరిపక్వత చెందుతారు. రజస్వల కాకపోయినా వీరి జననేంద్రియాలు సంయోగానికి అనువుగా వుంటాయి. సాధారణంగా రజస్వల కావడానికి 2, 3 సంవత్సరాల ముందునుండే సెక్సు హార్మోన్లు తయారవడం ప్రారంభం అవుతాయి. కనుక జననేంద్రియాల వికాసంతో పాటు సెక్సు కోరికలు కలుగుతాయి. అటువంటప్పుడు అరుదుగా కొందరిలో సెక్సు సంబంధాలు సహజం. రజస్వల అవడం అనేది స్త్రీలో మొదటిసారి అండం విడుదలైన తరువాత 14 రోజులకి కనబడే బహిస్టుస్రావం. ఒకవేళ రజస్వల అవడానికి ముందునుండే ఆ బాలికకు పురుష సంపర్కం అంటూ ఉంటే మొట్టమొదటిసారి విడుదలైన అండంతో వీర్యకణములు కలిసి పిండంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఆ బాలిక రజస్వల అయినట్లు సూచనగా బహిష్టుస్రావం అవకుండానే గర్బవతి కావడం జరుగుతుంది. రజస్వల కాకుండానే గర్భవతులైన స్త్రీల గాధలు వైధ్య చరిత్రలో లేకపోలేదు.

బహిస్టు సమయంలో సంయోగం చేసినా గర్భం వస్తుందా?

సాధారణంగా బహిస్టు స్రావం అవుతున్నప్పుడు రతిలో పాల్గొంటే గర్భం రాదని భావిస్తూ వుంటారు. కాని