పుట:KutunbaniyantranaPaddathulu.djvu/18

ఈ పుట ఆమోదించబడ్డది

2. నిరోద్

నిరోద్ అంటే ఏమిటి?

క్రొత్తగా పెళ్ళి అయిన కుశల్రావుకి కొంతకాలం పాటు కుటుంబ నియంత్రణ పాటించాలని కోరిక కలిగింది. రోజూ రేడియోలో ప్రచారం చేస్తున్న "నిరోద్" అతన్ని కూడా ఆకట్టుకుంది. అనుకున్న ప్రకారంగా అతని భార్య అనిత అంగీకారంతో నూతన దాంపత్య జీవితాన్ని ప్రారంభించాడు. పాపం నిరోద్ గురించి విన్నాడుకాని, నిరోద్‌ని ఎలా వాడాలో తెలియక చివరికి తికమక పడ్డాడు. ఆ తికమక పర్యవసానంగా అతనికి అనుకోని విచిత్ర సమస్య తయారయింది. మరుసటి ఉదయమే డాక్టరు దగ్గరకు పురుగెత్తి "డాక్టర్ ! మీకు ఎలా చెప్పాలో తెలియకుండా ఉంది. కాని చాలా ప్రమాదం జరిగిపోయింది. కుటుంబ నియంత్రణ కోసం నిరోద్ వాడబోతే అది సంయోగ సమయంలో నా భార్య యోని మార్గంలో జారిపోయింది. ఏమి చేయాలి డాక్టర్? దీనివల్ల నాభార్యకి ఏమైనా ప్రమాదం అవుతుందా?" అని భయపడిపోతూ అడిగాడు.

కుశల్రావుకి నిరోద్ సరిగ్గా యెలా వాడాలో తెలియకపోతే, ఇంకొంత మందికి అసలు నిరోద్ అంటే ఏమిటో