పుట:KutunbaniyantranaPaddathulu.djvu/178

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 178

నీరుచేరి ఉబ్బినట్లు అవవచ్చు. పని చేయగానే ఆయాసం అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అన్నం తినగానే ఆయాసం వస్తుంది. దీనికి కారణం పెరుగుతున్న గర్భంకోశం, జీర్ణకోశాన్ని చాతిని నొక్కివేయడమే. అప్పుడప్పుడు సడన్‌గా కడుపు బిగదీసినట్లు అవుతుంది. మూత్ర విసర్జన కూడా ఎక్కువసార్లు అవుతుంది. కడుపుపైనుంచి చేతితో నొక్కిచూస్తే బిడ్దకి సంబంధించిన శరీర భాగాలయిన తల, పిరుదులు, చేతులు, కాళ్ళు మొదలయినవి తగులుతూ వుంటాయి.

* * *