పుట:KutunbaniyantranaPaddathulu.djvu/170

ఈ పుట ఆమోదించబడ్డది

20. సంతాన నిరోధ పద్ధతులు విఫలమైతే కలిగే లక్షణాలు

కోమల కోటి కోర్కెలతో సంసార జీవితంలో అడుగు పెట్టింది. కాశ్మీరునుంచి కన్యాకుమారి వరకు హనీమూన్ వెళ్ళాలని, జీవితాన్ని హాయిగా అనుభవించాలనుకుంది. అందుకోసం వెంటనే గర్భం రాకుండా ఏవేవో మందులు వాడింది. అవి సక్రమంగా వాడకపోయేసరికి కల చెదిరింది. వివాహమయిన కొద్దిరోజులకే కారులో కాస్త దూరమైనా వెళ్ళలేని అనారోగ్యస్థితి ఏర్పడించి. పెళ్ళికాక ముందు అందరి అమ్మాయిల్లాగానే ఎన్నో తీయని కలలుకన్నది. స్కూటరు మీద కూర్చుని, బీచ్ రోడ్డున భర్త నడుముకి చేయిచుట్టి రయ్‌మని పోవాలనుకుంది. కాని పెళ్ళి అయి రెండు-మూడు నెలలు అవకుండానే వాంతులు - వికారం ప్రారంభంఆయ్యాయి.

వాంతులు - నీరసం

సాధారణంగా కడుపు వచ్చినప్పుడు వేవిళ్ళు కలుగుతాయి. ఉదయంపూ'ట ఒకటి రెండు వాంతులు అవడమో లేక కడుపులో వికారంగా వుండటమో తప్ప తల్లి ఆరో