పుట:KutunbaniyantranaPaddathulu.djvu/166

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 166

తారు. తరువాత మళ్ళీ మూత్రాన్నీ, యాంటీబాడి, యాంటీజన్ మిశ్రమాన్నీ పుల్లతో బాగా కలుపుతారు. అటుపిమ్మట గ్లాస్ స్లైడుమి రెండు నిమిషాలు నెమ్మదిగా ఇటు అటు త్రిపుతారు.

గావిండెక్స్ టెస్థులో ఎలా తెలుసుకోవచ్చు ?

మూత్రంలో కనుక హ్యూమన్ కోరియానిక్ గొనాడో ట్రాపిక్ హార్మోను లేకపోతే (గర్భం దాల్చటం జరగక పోవడంవలన) యాంటీబాడీ, యాంటీజన్ లు రెండూ రెండునిమిషాల్లో కలిసిపోతాయి. ఇలా కలిసిపోవడాన్ని 'ఎగ్లుటినేషన్' అంటారు. ఎగ్లుటినేషన్ ఏర్పడితే గర్భిణి కాదని అర్ధం. దీనినే గ్రావిండెక్స్ టెస్టు నెగటివ్ అంటారు. ఇక్కడ టెస్టు నెగటివ్ అంటే గర్భం లేదని అర్ధం.

మూత్రంలో కనుక హ్యూమన్ కోరియానిక్ గొనాడో ట్రాపిక్ హార్మోను ఉంటే అది యాంటీ బాడీస్ తో సంయోగం చెందుతుంది. అప్పుడు యాంటీబాడీస్ న్యూట్రలైజ్ అవడం వలన యాంటిజన్ తో ఎగ్లుటెనేషన్ ఏర్పడదు. ఈవిధంగా ఎగ్లుటెనేషన్ రెండు నిమిషాల్లో ఏర్పడకపోతే గర్భిణీ అని అర్ధం. దీనినే గ్రావిండెక్స్ టెస్టు పాజిటివ్ అంటారు. ఇక్కడ పాజిటివ్ అంటే గర్బిణీ అయినట్లే అర్ధం.