పుట:KutunbaniyantranaPaddathulu.djvu/15

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 15

అనేక సమస్యలు తెచ్చి పెట్టడమే అవుతుంది. అదుపు లేకుండా జనాభా పెరిగినట్లయితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తుంది. మురికివాడలు పెరిగిపోతాయి.

వాతావరణ కాలుష్యం విపరీతమై పోతుంది. సంఘవిద్రోహశక్తులు ఎక్కువైపోయి దోపిడీలు, దొంగతనాలు, హత్యలు పెరిగిపోతాయి.

విపరీతంగా జనాభా పెరిగిపోతున్న దృష్ట్యా, దాని వల్ల తలెత్తుతున్న అనేక విషమ సమస్యల దృష్ట్యా, కుటుంబ నియంత్రణని పాటించడం, ఒకరిద్దరి పిల్లలతో సంతానాన్ని పరిమితం చేసుకోవడం ఈనాటి దంపతుల తక్షణ కర్తవ్యం.

* * *