పుట:KutunbaniyantranaPaddathulu.djvu/149

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 149

నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. వీరు ఎటువంటి ఆపరేషను చేయించుకుని ఉండరు. దీనికి ఇంతకుముందు చెప్పుకున్న కారణాలే కాకుండా వెన్నుపూసలకి సంబంధంచిన లిగమెంట్ల మీదా, బస్థి ఎముకలకి సంబంధించిన లిగమెంట్లమీద గర్భం రావడంవల్ల అధికమైన ఒత్తిడి కలగడమే మరొక కారణం. అంతేకాదు కొంతమంది స్త్రీలకి వెన్ను పూసల మధ్య ఉండే మెత్తని దిండులాంటి డిస్క్ గర్భం పెరగడమువల్ల కాస్త తొలగడము జరుగుతుంది. దీనినే డిస్క్ ప్రొలాప్స్ అని అంటారు దీనివలన కూడా నడుము నొప్పి వస్తుంది. మరికొంతమంది స్త్రీలకి గర్భము రాకముందే కొన్ని కారణాలవలన వెన్నుపూసలలోని చివరి పూస కాస్త తోలగివుండటమో, వెన్నుపూసకి సంబందించిన ఒక భాగం బస్థి ఎముకని ఆంటుకుని పోవడమో జరిగి ఉంటుంది. ఇలా జరిగినప్పటికీ కొందరిలో ఏ బాధ తెలియకుండా ఉంటుంది. కాని మొదట కాన్పు అవడముతో ఈ పరిస్థితికి సంబంధించిన బాధ నడుమునొప్పి రూపంలో బయటపడుతుంది. కొంత మందికి రెండవ కాన్పుతో మరింత నడుమునొప్పి యెక్కువ అవుతుంది. ఇద్దరు పిల్లలు పుట్టగానే ఆపరేషన్ చేయించుకుని తరువాత పై కారణాలవల్ల వచ్చిన నడుము నొప్పిని ట్యూబెక్టమీ వలననే వచ్చిందని భావించనారంబిస్తారు. ఈ రకంగా గర్భం రావడం వలన బయటపడిన నడుమునొప్పిని ఆర్ధోపెడిక్ కారణాలైన శాక్రో-ఇలియాక్,