పుట:KutunbaniyantranaPaddathulu.djvu/144

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 144

వడం ఉండదు. ఏ కారణంవల్ల కానివ్వండి ట్యూబులు వాచి కడుపులో నొప్పి వచ్చినప్పుడు అశ్రద్ధ చేసి ఊరుకోకుండా ముందే డాక్టరుకి చూపించి సక్రమంగా మందులు వాడినట్లయితే పూర్తిగా బాధలన్నీ తగ్గిపోతాయి. అలా చేయని వాళ్ళే అనవసరంగా ట్యూబెక్టమీ వల్ల కడుపులో నొప్పులు వస్తాయని అనడం జరుగుతుంది.

గనేరియా తెచ్చి పెట్టే గందరగోళం

కాన్పయిన రెండు నలలకి నీరజ ఆపరేషను ఛేయించుకుంది. ఆపరేషను అయిన ఆరు నెలలకి కాపురానికి వెళ్ళింది. ఆపరేషను అయినా ఏ బాధా అనిపించక పోవడంతో నీరజకి నిజంగానే ఆనందం కలిగి అందరితో ఆపరేషను ఛెయించుకోమని చెప్పేసింది. అలాంటి అభిప్రాయం అట్టే కాలం ఉండకుండానే తిరిగి కాపురానికి వెళ్ళిన నీరజకి కటుపులో నొప్పి రతిలో బాధ ప్రారంభమయినాయి. అర్ధంకాని అయోమయ పరిస్థితిలో పడిపోయిన నీరజ ఇదంగా ఆపరేషను వల్లనే అని ఆపోహపడింది.

అయినా డాక్టరుని సంప్రదిస్తే బాగుంటుందని వెళ్ళితే కడుపులో నొప్పికి డాక్టరు చెప్పిన కారణం గందరగోళ పరిచింది. కడుపులో నొప్పి ట్యూబెక్టమీవల్ల కాదట, గనేరియావల్లనట. కాని నీరజ విషయంలో ఇది నమ్మశక్యం గాని నిజం. అంతకాలం నీరజ దగ్గర లేకపోయేసరికి ఆమె