పుట:KutunbaniyantranaPaddathulu.djvu/140

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 140

ట్యూబెక్టమీ చేయించుకుంటే స్త్రీలలో కామపరంగా కోర్కెలు తగ్గిపోవడంకాని, రతిలో అసమర్ధత కలగడంగాని జరగదు. పైగా ఇక గర్భం రాదనే ధైర్యంతో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. ఈ ఆపరేషను వల్ల అజీర్తి వ్యాధులు, తలనొప్పి, దృష్టిమాంధ్యం వస్తాయనుకోవడం కేవలం ఆపోహ మాత్రమే. ఒక వేళ అవి వచ్చినా ఈ ఆపరేషన్ వల్ల మాత్రం కాదు. జాగ్రత్తగా గమనిస్తే వాటికిగల ఇతరకారణాలు అర్ధం అవుతాయి.

ట్యూబెక్టమీ మంచిదా? వేసెక్టమీ మంచిదా?

కుటుంబ నియంత్రణ అమలు వరచా లనుకున్నప్పుడు దంపతులిద్దరిలో ఎఫరు ఆపరేషన్ చేయించుకున్నా మంచిదే. ఈ ఆపరేషనువల్ల ఎట్టి భాధగాని, దుష్ఫలితాలుగాని లేవు. గనుక దంపతు లిద్దరిలో ఎవరు చేయించుకున్నా ఒక్కటే. అయితే ట్యూబెక్టమీ చేయించుకుంటే స్త్రీలు వారం రోజుల పాటు మంచంమీద ఉండవలసి వస్తుంది. అదే పురుషునికైతే ఆపరేషను చేయించుకున్న మరుక్షణంనుంచి బయట తిరగవచ్చు, పని చేసుకోవచ్చు. భార్యకంటె భర్త ఆపరేషను తేలికైంది కనుక భర్తె వేసక్టమీ చేయించుకుంటే బాగుంటుంది. పైగా కాన్పులవల్ల, పిల్లల్ని పెంచడంవల్ల బాధపడే భార్య తిరిగి భర్త తననే ఆపరేషను చేయించుకోమని అడిగితే కొంత అసంతృప్తిని వ్యక్తపరచవచ్చు. అందు