పుట:KutunbaniyantranaPaddathulu.djvu/139

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 139

వేసక్టమీ ఛేయించుకుంటే కొంతకాలం రతికి అభ్యంతరం ఎందుకు?

రతిలో పాల్గొనె విషయంలో వేసెక్టమీకి, ట్యూబెక్టమీకి తేడా ఉంది. స్త్రీలు ట్యూబెక్టమీ చేయించుకోగానే రతిలోపాల్గొన్నా గర్భం రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. కాని పురుష్సులు వేసెక్టమీ చేయించుకున్నతరువాత కనీసం నెలరోజులైనా రతిలో పాల్గొనకుండా వుండాలి. ఒకవేళ కంట్రోలు చేసుకుని ఉండలేకపోతే నిరోద్ గాని, యితర కుటుంబనియంత్రణ సాధనాలుగాని ఉపయోగించాలి. లేకపోతే భార్యకి గర్భం వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే ఆపరేషను చేసేనాటికి వృషణాలనుంచి విడుదలైన వీర్యకణాలు శుక్రకోశాలకిచేరి అక్కడ నిలవవుంటాయి. ఒకసారి శుక్రకోశాలలో నిల్వచేరిన వీర్యకణాలు నెలనుంచి మూడు నెలలదాకా సజీవంగా వుంటాయి. వేసెక్టమీ ఆపరేషన్‌లో వృషణాల నుంచి వీర్యకణాలు పయనించకుండా వీర్యవాహికలని కత్తిరించడం జరుగుతుంది కాని శుక్రకోశాలని మూసివేయడమంటూ జరగదు. అందుకనే వేవక్టమీ చేయించుకున్న వ్యక్తులను తిరిగి రతిలో పాల్గొనే ముందు వీర్య పరీక్ష చేయించుకుని అందులో వీర్యకణాలు లేకపోతేనే రతిలో పాల్గొనమని సలహా ఇవ్వడం జరుగుతుంది. వీర్యంలో వీర్యకణాలు ఉంటే ఇంకా కొద్దిరోజులు ఆగమని సలహా యివ్వడం జరుగుతుంది.