పుట:KutunbaniyantranaPaddathulu.djvu/136

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 136

జనరల్ ఎనస్థీషియా అంటారు. అయితే మినీలాప్ ట్యూబెక్టమీ ఆపరేషను సాధారణంగా లోకల్ ఎనస్థీషియాతోనే చేయడం జరుగుతోంది.

'మినీలాప్ ' ఆపరేవ్షనుని సాధారణంగా లోకల్ ఎనస్థీషియాలోనే చేయడం జరుగుతోంది కనుక ఆపరేషను చేసిన స్త్రీని కొద్ది గంటల్లోనే ఇంటికి పంపివేయటం జరుగుతుంది. ఇంటికి వెళ్ళీన రోజు రాత్రే మామూలుగా కడుపు నిండా భోజనం ఛేయవచ్చు. మరుసటి రోజునుంచే ఇంట్లో వంటావార్పూ చేసుకోవచ్చు.

మినీలాప్ ఆపరేషను ఏ స్త్రీ అయినా ఛేసుకోవచ్చు. ఎటువంటి దుష్పలితాలు ఉండవు.

ట్యూబెక్టమీ వల్ల బహిస్టులు సక్రమంగా వుండవా?

కొందరు స్త్రీలు ట్యూబెక్టమీ చేయించుకుంటే బహిస్టులు సక్రమంగా రావని, ఒకవేళ బహిస్టులు సక్రమంగా వచ్చినా బహిస్టుస్రావం అధికంగా అవుతుందని భావిస్తూ ఉంటారు. ఇలా భావించటం వారి అజ్ఞానానికి చిహ్నమే తప్ప వాస్తవానికి అలా ఏమీ జరగదు. బహిస్టులు సక్రమంగా రావడం, రాకపొవడం అనేది అండాశయంనుంచి తయారయ్యే ఈస్ట్రోజన్, ప్రొజిస్టిరోన్ హార్మోన్ల