పుట:KutunbaniyantranaPaddathulu.djvu/13

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్దతులు 13

త్రణ పాటించకపోయినట్లయితే ప్రతీ స్త్రీకి తన సంతాన వృద్ధి కాలంలో సగటున 6 గురు లేక 7 గురు పిల్లలు పుడతారు. ఈవిషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చూస్తే కుటుంబనియంత్రణని పాటించకపోతే జనాభా ఎంత విపరీతంగా పెరిగిపోతుందో అర్ధమవుతుంది. మన దేశంలో సాధారణంగా ఆడపిల్లలకి 15 - 19 సంవత్సరాలు వయస్సు వచ్చేసరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇంతకంటే తక్కువ వయస్సులో కూడా పెళ్ళిళ్ళు అయిపోయే ఆడపిల్లలు ఎందరో ఉన్నారు. మనదేశంలో 18 సంవత్సరాల లోపు ఉన్న 60 శాతం మంది ఆడపిల్లలకి ఇప్పటికే పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్నాయని జనాభా లెక్కలలో తేలింది. మరొక విశేషమేమిటంటే 14 - 16 సంవత్సరాలలోపు వివాహం చేసుకున్న స్త్రీలకి సంతానం చాలా త్వరగా కలుగుతుంది. అంతే కాకుండా పిల్లలు వెంట వెంటనే పుట్టుతారు. 17 - 19 సంవత్సరాల వయస్సులో కూడా దాదాపు వెంట వెంటనే పిల్లలు పుట్టటం జరుగుతుంది. అదే 19 సంవత్సరాలు దాటిన తరువాత అయితే అంత వెంట వెంటనే పిల్లలు పుట్టటంగాని, పెళ్ళి అవగానే గర్భం రావడంగాని ఉండదు. అదే ఇంకా 25-30 సంవత్సరాలు దాటితే పిల్లలు వెంట వెంటనే కలగటం ఉండదు. అందుకని జనాభా పెరగకుండా అదుపు చేయాలంటే వివాహ వయస్సుని పెంచడం అవసరం.