పుట:KutunbaniyantranaPaddathulu.djvu/128

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 128

బ్దపు ప్ర్రారంభంలో పురుష సెక్స్ హార్మోను వృద్ధి అవడం గురించి పరిశోధనలు జరుపుతూ, వృద్ధాప్యం సమీపించబోయే వ్యక్తులమీద ప్రయోగాలు జరిపారు. అందుకోసం అటువంటి పురుషులలో వీర్యవాహికలని రెండువైపులా వీర్యకణాలని ప్రయాణించడానికి వీలు లేకుండా ముడివేశారు. ఇలా వీర్యవాహికలని రెండు వేపులా ముడివేయడం వల్ల వృద్దాప్యం సమీపించడంలొ కామసామర్ధ్యం సన్నగిల్లుతున్న వ్యక్తులలో తిరిగి యువకత్వం ప్రసాదింపబడింది. ఈ యువకులలో తిరిగి కామవాంఛ కలగడం, కామసామర్ధ్య్హం పెంపొందడం జరిగిందని ఆయన వివరించారు. దీనెనే తిరిగి యౌవనాన్ని ప్రసాదించే పద్ధతిగా ఆయన ప్రస్తుతించారు. అయితే ఆనాడు స్టీనాక్ చేసిన ఈ పరిశోధనలు తక్కిన వారినుండి తగిన ప్రోత్సాహం లంబించక మరుగున పడిపోవడం జరిగింది. ఈ నాడు లక్షల మందికి వేసెక్టమీ చేయడం జరుగుతొంది. కనుక తిరిగి యౌవనాన్ని ప్రసాదింపబడే ఈ ఆపరేషన్ గురించి పరిశోధనలు జరపడానికి మంచి అవకాశం లభించింది. దానితో స్టీనాక్ అభిప్రాయానికి మంచి ప్రొద్బలం లభిస్తోంది. పై పరిశోధనలనుబట్టి వేసక్టమీ చేయించుకున్న తరువాత నపుంసకత్వం ప్రాప్తించిందని ఎవరయినా అంటే అది కేవలం ఆపరేషను గురించి కలిగించుకున్న భయాందోళనలవల్లనే అని తేలిపోతోంది.