పుట:KutunbaniyantranaPaddathulu.djvu/127

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 127

జరుగుతోంది. వేసెక్టమీ చేయించుకున్న తరువాత వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది దానితో వీర్యకణాలని తయారు చెసే టిస్యూలు వృషణాలలో కృశించిపోతాయి ఈ కృశించిపోతున్న టిస్యూల ప్రభావం మెదడులో వున్న పిట్యూటరీ గ్రంధిమీద పడుతుంది. అప్పుడు పిట్యూటరీ గ్రంధి నుండి పురుష సెక్స్ హార్మోను అయిన టెస్టొస్టిరిన్ ఉత్పత్తి ఎక్కువ అవడానికి గొనాడోట్రాఫిన్ విదుదల అవుతుంది. ఈ విధంగా విడుదలైన గొనాడోట్ర్రాఫిన్ టెస్టొస్టిరోన్ ఉత్పత్తి మరింత పెరగడానికి దోహదంచేస్తుందని అభిప్రాయపడడం జరుగుతోంది. ఈ అభిప్రాయాన్నే మరికొన్ని పరిస్థితుల్లో పరిశీలించి సమర్ధించడం జరిగింది. కొందరిలో పుట్టుక నుంచే వీర్యవహికలు లేకుండా ఉంటాయి. ఆటువంటి వారిలో కూడా వేసేక్టమీ చేయించుకున్న వాళ్ళల్లో ఎలా గైతే పురుష సెక్స్ హార్మోనుని తయారుచేసే టిస్యూలు వృద్ధి చెందడం జ్రుగుతాయో వీళ్ళల్లోనూ అలాగే జరుగుతాయి.

నవ యౌవనము

వేసక్టమీ చేయించుకుంటే లైండింగ్ సెల్స్ వృద్ధి అయి పురుష హార్మోను ఉత్పత్తి మరింత పెరుగుతుందని మొదట చెప్పిన వ్యక్తి 'యూజిన్ స్టీనక్ '. ఈ శాస్త్రవేత్త వియన్నాకి చెందిన ఎండోక్రైనాలజిష్టు. ఈ ఇరవై శతా