పుట:KutunbaniyantranaPaddathulu.djvu/124

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 124

వేసెక్టమీవల్ల మరింత కామ సామర్ధ్యము

రవీంద్రనాధ్ టాగూర్ మెడికల్ కాలేజీ, ఉదయపూర్‌కి చెందిన డాక్టర్ గుప్తా, డాక్టర్ కొఠారి, వారి సహచరులు విశేష కృషి చేసి వేసక్టమీ చేయించుకున్న వాళ్ళలో పుంసత్వం ఏ మాత్రం తగ్గిపోదని ఋజువు చేసి చూపించారు. పురుషునిలో కామవాంఛ కలగాలన్నా, కామసామర్ధ్యం ఉండాలన్నా పురుష సెక్స్ హార్మోను అయిన టెస్టోస్టిరోన్ తగినంత మోతాదులో ఉండటం అవసరం. తెస్టోస్టిరోన్ హార్మోను ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు కామసామర్ధ్యం కూడా తగ్గిపోతుంది. అయితే కొందరిలో టెస్టోస్టిరోన్ ఉత్పత్తి తగ్గిపోకుండానే, కామసామర్ధ్యం సన్నగిల్లినట్లు అవుతుంది. దానికి కారణం వాళ్ళల్లో కామసామర్ధ్యం గురించి అనవసరంగా కలిగిన అనుమానాలు, భయాలవల్లనే వాస్తవానికి వేసక్టమీ చేయించుకున్న వాళ్ళల్లో కామసామర్ధ్యం గురించి అనవసరంగా కలిగిన అనుమానాలు, భయాలవలల్నె వాస్తవానికి వేసెక్టమీ చేయిందుకున్న వాళ్ళల్లో పురుష సెక్సు హార్మోన్ అయిన టెస్టోస్టిరోన్ ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీనివల్ల వేసక్టమీ చేయించుకున్న వాళ్ళలో కామసామర్ధ్యం పెరుగుతుంది తప్ప తగ్గదు.

వృషణాలలో టెస్టోస్టిరోన్ ఉత్పత్తి చేయడానికి ప్రత్యేకమైన టిస్యూలు ఉంటాయి. ఈటిస్యూలనే లైడింగ్ సెల్స్ అని అంటారు. డాక్టర్ గుప్తా, డా: కొఠారి ఒక ప్రత్య్హేక పద్ధతి అవలంబించి వేసెక్టమీ చేయించుకున్న