పుట:KutunbaniyantranaPaddathulu.djvu/113

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 113

ఛాయాదేవికి మూడుపదుల వయస్సు నిండకముందే ముసలితనం వచ్చేసింది. ఇరవైఅయుదు సంత్సరాల ఛాయాదేవిలో అరవై అయిదు సంవత్సరాల వయస్సులో ఉండే అనారోగ్యం వచ్చేసింది. ముఖంలో మొన్నీమధ్య వరకు ఉన్న బ్యూటీ లేదు. రక్తహీనతతోపాటు మొఖం పాలిపోయి కళావిహీనంగా వుంది. వంకీలు తిరిగేజుట్టు ఊడిపోయి ఉత్త బోడిగుండుగా కాబోతుంది. నడుములో ఓపికలేదు. నడకలో ఊపులేదు. చార్మింగ్ లేడీ అయిన ఛాయాదేవి చేవలేకుండా అయిపోయింది.

ఛాయాదేవి అలా అయిపోవడానికి కారణం ఆమె కరెంటు అంటూ చేయించుకున్న చికిత్సే కారణం. దీనిని డీప్ ఎక్సరే ట్రీట్ మెంటు అని, రేడియేషన్ చికిత్స అనీ అంటారు.

ముప్పు తెచ్చే డీప్ ఎక్స్ రే

డీప్ ఎక్స్ రే చికిత్స కేవలం కేన్సర్ వచ్చినప్పుడు కేన్సర్ కి సంబంధించిన పుండుని మాడ్చివేయడానికి ఉపయోగిస్తారు. ఈ డీప్ ఎక్స్ రే కిరణాలు కేన్సర్ కణితిని కాకుండా మామూలుగా ఆరోగ్యకరంగా ఉండేకణాలని కూడా మాడ్చివేస్తాయి. ఇలాంటి గుణం ఉండబట్టే అరుదుగా కొందరు డీప్ ఎక్స్ రేని ఉపయోగించి గర్భకోశాన్ని, అండా-