పుట:KutunbaniyantranaPaddathulu.djvu/111

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 111

ఉష్ణోగ్రత పెరగడానికి కారణం ఆ రోజునుంచి ప్రొజిస్టిరోన్ హార్మోను మరింత ఎక్కువ ఉత్పత్తి అవడమే.

ధర్మామీటరు సహాయంతో శరీర ఉష్ణోగ్రతని గమనిస్తున్న కొందరిలో ఉష్ణోగ్రత పెరగడానికి ఒక పూట గాని, ఒక రోజు ముందుగాని అంతకు ముందు ఉన్న శరీర ఉష్ణోగ్రత ఒక అరడిగ్రీ పడిపోవడం కనబడుతుంది. సరిగ్గా అండం విడుదలయ్యే ముందు కొందరిలో శరీర ఉష్ణోగ్రత పడిపోయి మళ్ళీ వెంటనే పెరుగుతుంచి. కొందరిలో ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా మార్పు కనబడిన రోజున పొత్తికడుపులో నొప్పి అనిపించడం, కొద్ది చుక్కలు రక్తస్రావం అవడం ఉంటాయి. ఇవన్నీ ఆండం విడుదలకి చిహ్నాలే.

ఈ ఉష్ణపట్టికలు (టెంపరేచర్ చార్టులు) వలన ఆ స్ర్రీలలో అండం విడుదల ఎప్పుడు అవుతున్నదీ స్పష్ణంగా తెలుస్తుంది. దానిబట్టి కుటుంబనియంత్రణని పాటించే స్త్రీలు జాగ్రత్త పడవచ్చు అయితే లూప్ వేయించుకున్నవారు, నోటి మాత్రలు వాడేవరు, టుడే వంటి వెజైనల్ టాబ్లెట్టు వాడేవారు, భర్తలు నిరోధ్ వాడేవారు అయినప్పుడు ఉష్ణోగ్రత పట్టిక అవసరం లేదు. సేఫ్ పెరియడ్, క్వాయిటస్ రిజర్వేటస్ పాటించేవారు శరీర ఉష్ణోగ్రతని గమనించి దాని ప్రకారం జాగ్రత్త పడటం మంచిది.

* * *