పుట:KutunbaniyantranaPaddathulu.djvu/11

ఈ పుట ఆమోదించబడ్డది

అంటే కేవలం 80 సంవత్సరాల్లో దేశ జనాభా మూడు రెట్లు అయిపోయింది. మరో మాటలో చెపాలంటే 80 సంవత్సరాల్లో 45 కోట్ల జనాభా పెరిగిపోయింది. మళ్ళీ నాలుగేళ్ళలో తీసే జనాభా లెక్కల్లో ఇంకెన్ని కోట్ల జనాభా పెరిగిపోతుందో ! సంవత్సరానికి సగటున ఒక కోటి 30 లక్షల చొప్పున పెరుగుతున్న మన దేశ జనాభా 1990 నాటికి 82 కోట్లు అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ శతాబ్దాంతానికి 95 కోట్లు దాటుతుంది.

1600 సంవత్సరంలో మన దేశ జనాభా ఉజ్జాయింపుగా 13 కోట్లు ఉండేది. క్రిందటి శతాబ్ధం చివరినాటికి దేశ జనాభా 23 కోట్లు అయింది. అంటే మూడు వందల సంవత్సరాలకి కేవలం 10 కోట్ల జనాభాయే పెరిగింది. 300 సంవత్సరాలకి కేవలం 10 కోట్ల జనాభాయే పెరిగితే ఈనాడు 1971 నుంచి 1981 నాటికి 10 సంవత్సరాల వ్యవధిలోనే 14 కోట్లు జనాభా పెరిగిపోయింది. దీనికి కారణం వైద్యశాస్త్రం గణనీయంగా అభివృద్ధి చెందడమే. పూర్వకాలం మశూచి, కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులతో లక్షలాది మంది మరణించినారు. అలాగే ఎన్నో ప్రసూతి, శిశు మరణాఅలు ఉండేవి. మరి ఈనాడు అటువంటి భయంకర అంటువ్యాధులూ లేవు. వైద్యశాస్త్ర అభివృద్ధివల అంటువ్యాధులన్ని అరికట్టి జీవన ప్రమాణాన్ని ఎంతో పెంచుకున్నపుడు, అదే సమయంలో హద్దూ పద్దూ లేకుండా పెరిగి