పుట:KutunbaniyantranaPaddathulu.djvu/109

ఈ పుట ఆమోదించబడ్డది

13. శరీర ఉష్ణోగ్రతలో మార్పు- కుటుంబ నియంత్రణ

అండం విడుదల సమయంలో శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా ఒక డిగ్రీ ఫారన్ హీట్ పెరుగుతుంది. దీనినే ‘బేసల్ బాడీ టెంపరేచర్ ‘ పెరగటం అంటారు.

నెల నెలా సక్రమంగా బహిష్టు అయ్యే స్త్రీలోగాని, కాని స్త్రీలో గాని అండం విడుదల సమయంలో ఇలా ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకని అండం ధర్మామీటరు సహాయంతో చక్కగా గుర్తించవచ్చు. సక్రమంగా బహిష్టులు అయ్యే స్త్రీలో కొన్ని నెలలపాటు వరసగా ‘బేనల్ బాడీ టెంపరేచరు ‘ ని కొలచి నెలలో ఏరోజున ప్రతీసారి ఉష్ణోగ్రత పెరుగుతున్నదో గమనించినట్లయితే కుటుంబనియంత్రణ్ని పాటించే దంపతులు ఆరోజుకి కాస్తముందు, కాస్త తరువాత రతిలో పాల్గొనకుండానో, పాల్గొన్నా ఇతరసాధనాలనీ ఉపయోగించి గర్భం రాకుండా జాగ్రత్త పడవచ్చు.

అండం విడుదల తెలుసుకోవడం కోసం స్త్రీ తాను బహిష్టు అయిన మొదటిరోజునొంచి, తిరిగి బహిష్టు అయ్యే