ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఐదు] కుంభ రాణా 43

ఏమి యీగాన విశేషము !

అగ్బ : కావుననే లోకప్రసిద్ధమైనది.

తాన్ : తల్లీ, మమ్మొక్కమాఱు కరుణింపుము. మేము కృతార్థులమయ్యెదము.

సుశీ : [కన్నులుపులుముకొనుచు లేచి కూర్చుండి] మల్లీ వైద్దుగు లొచ్చినారె ! రోగమొక దోవ మందొకదోవ.

మీరా : [ఉల్కిపడిలేచును]

[అగ్బరు తాన్‌సేనులు లేతురు]

మీరా : ఆ! - మనోమోహనా, వచ్చితివా ? నన్నుఁగొనిపొమ్ము. ఎంతకాలము నీకయి వేచియుంటిని ?

సుశీల : ఇక్కణ్ణుంచి కొనిపొమ్మని వేడుకొంటుంది దొరసానమ్మ. [కూర్చుండి తూగును.]

మీరా : [అగ్బరు తాన్ సేనులు తట్టుతిరిగి] ఇద్దరు శ్రీకృష్ణులు ! [సుశీలవంకచూచి] ఇంకొక శ్రీకృష్ణుఁడు. [నలువంకలుచూచి] కోటానుకోట్ల శ్రీకృష్ణులు ! ఇందులో నాప్రాణేశ్వరుఁడైన యశోదానందనుఁడేడి?

అగ్బ : ఈ భక్తురాలికి లోకమంతయు శ్రీకృష్ణమయముగ నున్నది. అమ్మా, ఆకృష్ణుని మాకు చూపించి మమ్ములను భవ విముక్తులను గావింపుము.

మీరా : జగన్మోహనా, నీవు నాతో చెరలాట మాడుచున్నావా? నీవు నిన్నెఱుఁగవా? నీవు శ్రీకృష్ణుఁడవుగావా?

అగ్బ : ఈమె కీసమయమున నిహలోకజ్ఞాన మంతరించినది. రాధయే తానను విశ్వాసమున శ్రీకృష్ణ విశ్లేషము సహింపనోపక యార్తిఁజెందు చున్నది. మనమిప్పు డీమెతో సంభాషింపలేము. దర్శనముచే పవిత్రుల మైతీమి. గానముచే హృదయము నిర్మలమయ్యెను. ఇఁక మరలుదము.