పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/93

ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునటి హింద్వార్యులు.

మునసాధింపబడినది. ఇట్టి యభిప్రాయమే పాశ్చాత్య విద్వాంసులలో గొందరు - హాబ్సు (Hobbs) మున్నగువారు - సూచించియున్నారు. "పూర్వకాలమున రాజనువాడు లేకపోవుట వలన ప్రజకనెక కష్టములు సంభవించెను. అందువలన జనులంద రేకీభవించి ఇతరుని దూషించినవాడును, కొట్టినవాడును, వరునిభార్యను చెఱచువాఢును, శిక్షంపబడవలయునని నియమము చేసికొనిరి. కాని యీనియమమును అమలులోబెట్టుటకు వలయుశక్తిలేనందున, వారందరు ప్రజాపతి కడకుబోయి, తమకొక పాలకుని నియమించుమనియు, అట్టిపాలకుని తాము గౌరవింతుమనియు, అతడు తమ్ము కాపాడవలసియుండుననియు, వేడికొనిరి. బ్రహ్మ మనువును ప్రజాపాలనము చేయుమని కోరెను. కాని మనువు అందున కొప్పుకొనక, జన్లు పాపాత్ములు కనుక వారిని పాలించుట పాపహెతువనియు, ప్రజాపరిపాలనము కష్టకార్యమనియు చెప్పెను. అంత జ్నులు మనువుతో నిట్లనిరి. తమరు భయపడవలసిన పనిలెదు. పాపాత్ములగువారే తమ పాపఫలము ననుభవింతురు. మీకు మాయొద్దనున్న్ పశువులలోను బంగరములోను అయిదవ భాగమును మాధాన్యములో పదియభాగమును ఇచ్చెదము. వివాహఋతువులో ఒక సుందరిని మీకిచ్చెదము. మాలో ముఖ్యులగువారు సాయుధులై మీకడవర్తింతురు. మమ్ము సుఖముగాను నియమబద్ధముగాను పాలింపుడు. మాకి లభీంచు పుణ్యమున నాల్గవభాగమును మెకిచ్చెదము. అంత మనువు వారివిన్నపము నంగీకరించి కార్యారంభమొనర్చెను. అతడు శత్రువుల నందఱ నిర్మూల