పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/68

ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

కాని కృష్ణుడు వారి యావేశము నడచి, అట్టి ప్రయత్ంహము వ్యర్ధమని బోధించి వారిని వారించెను. సీతాపహరణముకూడ నిట్టిదానిలొదే కాని యామె అంతకు ముందే వివాహితయై యుండెను. ఆలొచించి చూచిన పక్షమున వధూహరణము వివాహితల విషయమున గూద్?అ జరగుచుందెనని తోచుచున్నది., వివాహితలను లాగికొనుపోవు నాచారము రాక్షసులలోనిదై యుండవచ్చును. "అభుక" స్త్రీలను వివాహమాడుట ముఖ్యోద్దేశముగాగల ఆర్యు లిట్టి యాచారముకలిగి యుండుట మనకు విరుద్ధముగానే కానవచ్చును. పాండవు లరణ్యవాసము చేయుచుండిన కాలమున నొకనాడు ద్రౌపదిని జయద్రధుడు ఎత్తుకొని పొయినకధపై యట్టివివాహమునకు మఱియొక యుదాహరణము. ఈసందర్భమునధౌమ్యుడు పలికిన వచనము ఆకాలపు మర్యాద పైనకొంత కాంతిని ప్రసరింపజెయుచున్నది. "మహారధులగు నాపెభర్తలజయించికాని నీవామెను తీసుకొని పోజాలవు; జబద్రధా! పురతనమగు క్షత్రియ్ల ధర్మమును పాలింపుము" అని ధౌమ్యుడనెను ++దీనిని చూడగా వివాహితలను గూడ, వరి భర్తల నోడించి ఎత్తికొని పోవుట క్ష్లత్రియధర్మముగా నుండినట్టు కానవచ్చుచున్నది.

   పైశాచవివాహాచారము మనుష్యమాంసము దినుచుండిన పిశాచులను అనార్యజాతియండుండెనని మనమూహింప వచ్చును. ఈజాతివారియందు వివాహపద్దతిలేక పొవుటయేకాక

++సేయంశశ్యాత్వయాసేతు మవిజత్యమహారధాన్ ।ధర్మంక్షత్రిస్య పౌరాణ మపేక్షస్వయబద్రధ॥ వన ॥