పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/67

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి వివాహములు.

వరుని వివాహము చేసికొనుట మొదటిది; వరుడు తన బాహుబలమును ఏదైన పొటీయందు ప్రదర్శించి వధువును వివాహ మాడుట రెండవది. వీనిలో మొదటి పద్ధతి "గంధర్వ"లను అనార్యజాతివారి యనుకరణమున ఆర్యులలో ప్రవేశించి యుండును. మహాభారమందలి గాంధర్వ్ఫ వివాహములలో ఆదర్శ మనదిగినది శకుంతలా వివాహము. రెండవపద్ధతి ఆర్యక్షత్రియులకు మిగుల ప్రియమైనదిగానుండెను. రాచకన్నెవ్లు బెండ్లియాడు కుతూహలమున పలుమారు బ్రాహ్మణులుకూడ నిట్టి పందెములందు తమ బాహుబల ప్రదర్శనము చేయుచుండిరి. బలమును చూపుటకు సాధనము ఆకాలమున ధనుర్విధ్యయే. ద్రౌపదీ పాణిగ్రహణర్హత అట్టి విద్యనుబట్టియే నిర్ణయింపబడేను. పై యాచారము క్షాత్రయుగాంతమున గూడ నుండినట్టు గ్రీకు చరిత్రకారులు వ్రాసియున్నారు.*

   రాక్షస వివాహముకూడ తఱచుగా క్షత్రియులలోనె జరుగుచు బాహుబలోత్తేజమూనకు సహకారిగానుండెను. ఈ వివాహమునందు క్షత్రియుని కూతురును ఆమె కిష్టముగ నుండినను సరే లేకపోయినను సగే పురుషుడు బలాత్కారముగా లాగికొని పొవువును. వధువు బంధువు లాతని నెదిరింతురు, వరుడే వారి నోదించినచో వధువు అతని భార్యయగు చుండెడిది. సుభద్ర వివాహమిట్టిదే. మహాభారతమును బట్టి చూచినచో ఆమె మన:పూర్ఫకముగా నర్జును వెంట బోయినట్టు కానరాదు. సుభద్రబంధువులగు వృష్ణువులు అర్జును నెదిరింప దలచిరి;

  • "మెగాస్థనీసు మఱియు ఏరియను" మాక్ క్రండిల్ కృతము