పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/53

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి యాహారము.

గలవు. మాట్లాడకుండ భోజనము చేయుట మంచిదని మన హింద్వార్యులు తలచుచుండిరి, &కుటుంబమువారందఱు నొకమారే భుజించుచుండిరని తోచుచున్నది. విందువేళలందున్ యాగారులందును భూరిసంతర్పణములు జరుగుచుండెనని చెప్పవలెను. అశ్వమేధసమయమున వేలకొలది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు భోజనమువలన సంతృప్తులైరని మహాభారమునం దున్నది. నిర్ణీత కాలమునందు భోజనముచేయని దురభ్యాసము మనయందు నేటికీని గలదు. విందుసమయములందు మధురాహారములు వడ్దింపబడుచుండెను. "శాకమ్లనువండు వంట వాండ్రును మధురపదర్ధములను వండువాండ్రును ఎప్పటివలెనే ధృతరాష్ట్రుని సేనయందుందిరి." z ఈ శ్లోకమునుబట్టి ధనవంతులు మధుర పదార్ధములను ఎల్లప్పుడును తినుచుండిరని తెలియుచున్నది. దుర్యోధనుని పాలనమునాటివలెనే యుధిష్టిరుని పాలనయందుసైతము అమర్పబడుచుండిన మధురపదార్ధము లేవియో చెప్పుటకు వీలులేదు. *శర్కర, అల్లము మొదలగు వస్తువులతో జేయబడు తియ్యని పదార్ధములను, కూర్గాయలను వండుటయందు తెలివిగల వంటవాండ్రను నర్ధమిచ్చు వివిధశబ్దములను వ్యాఖ్యాత


$ ప్రాజ్మిభోత్యమర్నియా ద్వాగ్యగోన్నమ కుత్సయన్॥ అను॥

z అరాలికాసూపకారా, రావికాండవికాస్తధా ఉపతిష్ఠన్తరాజా నం,ధృతరాష్ట్రం పురాయనా॥ఆశ్ర॥

  • ఆపూసములు, ఖండవిరాగములు (లేక రాగఖండములు) అను రెండు విధములగు పదార్ధములును మోదకములును అచ్చటచ్చట వచ్చుచుండును.