పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/38

ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

క్షాత్రయుగాంతమునాటికి స్ధిరపడిన నీమూడవ యభిప్రాయమే ఇప్పటికాలమున పశుహింసతోగూడిన యాగములు విశేషముగా గానరాకపోయినను, క్షాత్రయుగాంతముననుండి యభిప్రాయమే యిప్పటికి స్థిరమైయున్నదనుట స్పష్టము. ఆహారవిషయమునను క్షాత్రయుగాంతమునాటి యభిప్రాయములే నేడును నిలచియున్నవి. అనగా నేటికిని క్షత్రియులును, హింద్వార్యులలోను మిశ్రార్యులలోను జేరిన కొన్ని బ్రాహ్మణజాతులవారును మాంసాహారమునే భుజించుచున్నారు.

   అయినను, ఒకవిషయమున మాత్రము కడపటివాక్యమున బేర్కొనబదినవారు తక్కుంగల హిందుచ్వుల మార్గమనుసరింపక తప్పలేదు. అదేదన గోవధము. హిందువులలోని వివిధశాఖలవా రెట్లు గోవృషభవధమును మహాపతకములుగ గణించుచుండిరో పై వారును నట్లే తలచుచుండిరి. *ఈనిషేధమెప్పుడు విధింపబడినదో తెలియదు. క్షాత్రయుగారంభమున మన హింద్వార్య్హులు గోవృషభము లను బలియిచ్చుచు, వాని వాని మాంసమును దినుచుండిరనుట నిర్విదాంశము. ఈసిద్దాంతమును బలపరచు వాక్యములు మహాభారతమం దెన్నియో కలవు. అనేక యాగములచే బ్రసిద్దిగాంచిన రంతిదేవుడు బలి

*

  • అర్జునిను శపధసందర్భమున జూడుడు:-

బ్రహ్మభ్నూనాంచయేలొకా, యేచగోధూతినామపి, సాయసంహియనానంహి శాకంకృసరమేవహి, సంయావాపూసమాంసాని యేచలొకావృధాన్నతాం॥ ద్రోణ॥