పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/37

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి యాహారము

స్త్యుని వేడికొని ఎప్పటివలె వర్షము గుఱిపించెను. దేవతలతొడి వైరమున తమ తపోధనమును వృధ చేసికొనుత మంచిపనికారు కనుక యాగములలో జరగు పశుహింస హింసయేకాదని విధింపుమని అగస్త్యుని ఋషులు వేడికొనిరి. అతడు వారివిన్నపము అంగీకరించెను. ఋషులు స్వస్థానములకు బోయిరి. ఈసమయమున జంతువుల బలుల కనుకూలముగ్ నభిప్రాయము మాఱినది కనుకనే అశ్వమెధపర్వమునందలి తుదియధ్యాయమున వెనుకటి స్థితిగతులుపోయి, ధర్మజుని యాగమును నిందించిన యానకులము నిజముగా నకులము కాదనియు, యముడు జమదగ్ని శాపవశమున నకులాకారమును ధరించెననియు, యుథిష్టిరుని యాగమును చూఱినప్పుడు శాపనివృత్తి కలుగవలసిన విధానముండెను కనుక యాగమును నిందించుట సంభవించినదనియు చెప్పబడియున్నది.

   మాంసాహారమును గుఱించియు, యాగములందు పశు హింస జరగుటను గురించియు జనుల యభిప్రాయము లెట్లుమారినవో చూపుటకై మెము నకులము యొక్క కధను కొంత దీర్ఘముగ వ్రాయ వలసినవారమైతిమి.  ఈ నకులముయొక్క కధ మనవారి యాహార విధానముయొక్క మూడు దశాభేదములను దెలుపుచున్నది. మొదట మాంసాహారులుగను జంతువుల్ను బలియిచ్చువారుగను నున్న హింద్వార్యులుగాను ఆపద్దతివదలి అహింసా సిద్దాంతము నవలంబించి రెండవదశకువచ్చిరి. ఆ రెండవదశనుండి మరల యాగాదులందు హింసజరుగవచ్చును. అన్ సిద్దాంతము నొప్పుకొని మూడవదశకు వచ్చిరి. ఈవిధముగా