పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/35

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి యాహారము.

ఈకధ యచ్చట తెచ్చిపట్టబడినది. క్షాత్రయుగారంబము నుండి యాయుగమును ముగియునాటికి జనులయభిప్రాయముము లేనివిధముగా మారినవో పైకధవలన దెల్లమగుచున్నది.

  జనాభిప్రాయము మెట్టిమార్పు జెందినను క్షత్రియులు మాత్రము నేడేట్లొ యట్లే ఆకాలమునందును పూర్వాచారమును వదలక మాంసాశనమును జంతువుల బలులను జరపుచునే యుండిరి. పైనాద్ని తరువాతయధ్యాయమున అప్పటి జనాభిప్రాయమును కొంతసమాధానపఱచుటకై యియ్యబడిన ప్తత్యుత్తరమొకటి మనకు కానవచ్చుచున్నది.  వ్యాసాదిమహర్షుల నియోగముననుసరించి ధర్మరాజుచేసిన యాయజ్ఞ కార్యమును నకులమెట్లు నిందింప సాహసించెనని జనమేజయుడు ప్రశ్నవేయగా వైశంపాయను డిట్లు చెపుచున్నాడు. పూర్వమొకప్పుడు ఇంద్రుడు యజ్ఞము చేయుచుండ యజ్ఞపశువుల జాలింగొలుపు చూపుల జూచి దయ దలచి 'పశుహింస అధర్మకార్యము కనుక ఈ యాగము సధర్మమైనది కాదు ' అని ఇంద్రునితో ననిరి. *ఇంద్రుడు వారితో నేకీభవిపనందున యజ్ఞములందు జంతువులను వధింపవచ్చునా కూడదా యని విషయమున ఇంద్రునకు ఋషులకును వాదము కలిగెను. అంత వారి వివాదాంశమున చేదిదేశపు రాజగు వసువుయొక్క తీర్మానమును గొరిరి. ఏది దొరకిన దానితోనే యజ్ఞము చేయవచ్చునని వసు

  • నాయంధర్మకృతోజ్ఞా నహింసాధర్మఉచ్యతే, యజబీజై సహ పాక్ష త్రివర్ష పరమోక్షితై: ॥అశ్వ॥