పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/38

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



భమిడిపాటి రామగోపాలం, ఎం.ఏ

సుప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత

విశాఖపట్నం - 530 022.

జనాంతికం

"సుకవి జీవించే ప్రజల నాలుకలయందు" అనే మహద్వాక్యం కొప్పరపు కవుల పట్ల వర్తించినంతగా ఇంకెక్కడా వర్తించదేమో!

కొప్పరపు కవులు కవిత్వం చెప్తూ ఉండిన కాలంలో అచ్చుయంత్రాలు విస్తారంగా లేకపోయినా కాగితం, కలం ఉన్నాయి ఐనా సరే వారి పద్యాలు మౌఖిక రక్షణలోనే ఉండిపోవలసి వచ్చింది. వ్రాసి దాచవలసిన కవిత్వమే అయినా వ్రాయడానికి సాధ్యం కాకపోవడం వల్లనే ఆ పరిస్థితి. అది కొప్పరపు కవుల "వేగం" కల్పించిన అవరోధం, ఆసౌఖ్యం,

ఇప్పుడు చెప్పుకుంటే అదేదో కల్పనలాగ అనిపిస్తుంది. కాని; అప్పుడది నిజమే. ఇవాళ మసం "స్పీడు యుగంలో ఉన్నాం' అని ఊరికే జబ్బలు చరుచుకుంటాం కాని వచనం రాయడానికి కూడా షార్టుహాండు వాళ్లు కావాలి కొప్పురపు కవులు గంటకి నూర్ల కొద్దీ పద్యాలు చెప్పినట్టు చాలామంది అప్పటి వాళ్ళు తమ తమ రచనలలో, ఉపన్యాసాలలో చెప్పేరు. అప్పట్లో షార్టుహాండు లేకపోయిన మాట నిజమేకాని, ఒకవేళ ఉండి ఉన్నప్పటికీ వ్రాసిపెట్టడం అసాధ్యం. అలా వారి అవధానాలను, ఆశు కవితలను తెలుగుజాతి తగినంతగా దాచుకోలేకపోయింది.

'ప్రజల నాలుకలయందు' కవుల పద్యాలు జీవిస్తాయి. కాని ప్రజలు తరాలు తరాలుగా విడి, గతించిపోతారు. వారితోపాటు ఆ నాలుకల మీద ఉండిన పద్య సంపద కూడా అంతరించిపోతుంది. కాని ప్రతిభావంతుడైన కవికి హృదయవేదులైన శిష్యులు ఉంటారు. వారు తమ గురువుల వద్ద “శిష్యరికం” చేయకపోయినా వారి గురువుల వాక్కులను స్మరామి నుండి, చరామి వరకు పరిరక్షించుకొని గురువులనే ధన్యులను చేయగల మహనీయులు. ప్రజాకవి వేమన తన వాక్కులను అలతి అలతి పదాల ఆటవెలదులలో రచించి వీటిని కంరానా హస్తానా నిలుపుకోని కవితాభిరుచి వృధా అనిపించగలిగాడు. సి.పి బ్రౌను వంటివారు వచ్చి ఆ పద్యాలనన్నింటినీ తాళపత్రాల నుంచి మనుష్యుల జ్ఞాపకాల నుంచి వాటిని “కాగిత బద్దం” చేసి అట్టి మహనీయుల కోవలోకి చేరారు. కొప్పరపు కవుల విషయంలో కుంటముక్కల జానకి రామశర్మ గారు, మిన్నికంటి గురునాథ శర్మగారు; నిడుదవోలు వేంకటరావు గారు ఏకబాణ సేనలవలే పరిశ్రమించి కొప్పరపు కవుల పద్యాల సేకరణను ఒక యజ్ఞంగా నిర్వహించి తాము ధన్యులవుతూ తెలుగు జాతికి అమూల్యమైన సంపదను సమకూర్చి పెట్టారు. ఆ కెరటాల ఉత్థాన పతనాలను జీర్ణించుకొని ధన్యత చెందిన మహనీయులు గుండవరపు లక్ష్మీనారాయణ గారు

xxxix