పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/284

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
243

మణికొండసంస్థానమున శ్రీతవిటిరెడ్డి గోపాలరెడ్డిగారను పండిత ప్రభువర్యునిచేఁ బండితప్రియంబుగా “బాలసరస్వతి" యను బిరుదము నంది యున్నారు.

నెల్లూరులో విద్యాప్రియులయిన మహాజనులచేఁ గూర్పఁబడిన సభలలోఁ దమ యాశుకవిత్వావధాన సామర్థ్యములఁ బ్రకటించి కవీంద్రసమ్మతముగా “ఆశుకవిసింహ” బిరుదము నొందిరి.

అప్పుడచ్చట స్పెషల్ డిప్టీకలెక్టరుద్యోగులును సంస్కృతాంధ్ర హూణభాషా ప్రవీణులును సత్కవితాధురంధరులునైన బ్రహ్మశ్రీ జయంతి రామయ్య పంతులు గారమ్మహాసభలో బిరుదమిచ్చు సమయమున

పంచశరున్ విరాలి గొలుపంగల చేడెల వాడిచూడ్కులన్
గొంచెము విచ్చు జాజిపువు గుత్తులనంటిన కమ్మతెమ్మెరన్
గాంచనగర్భురాణి కరకంజమునందలి చిల్కపల్కులన్
మించునుగాదె వీరి కమనీయ మహీయ కవిత్వసంపదల్

అని వచియించియున్నారు.

అచ్చట నుండి ఇరువది నాలుగు జిల్లాలకు ముఖ్యస్థానంబై లక్ష్మీ సరస్వతీ నివాస సదనంబై, రాజధానియై పొగడ్తకెక్కిన చెన్నపట్టణంబున కేగి అందుఁ బండిత కవీంద్ర మండల మండితంబులయిన మహా సభలలో నాశుకవిత్వావధాన విలాసంబులనేక విధంబుల గనుపరచిరి.

అట్టి యవధాన సమయములయందు సంతసించిన పండిత కవీంద్రు లీక్రింద నుదహరించిన విధంబునఁబద్య సత్కారంబుల జరిపిరి.

ఆనంద ముద్రాక్షర శాల హూణ సంస్కృతాంధ్ర పండిత కవులగు శ్రీమాన్ తంజావూరు దేవరాజ సుధీమణి గారు^

గుట గుట లింతగావు పటుగుంభిత గాంగ ఝరుల్సరస్వతీ
కటక ఝణం ఝణల్ శ్రుతి సుఖంబులు వేంకట సుబ్బరాయ వేం