పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రైలుబండిని బాహుబలంతో ఆపిన ‘కలియుగ భీముడు’ కోడి రామమూర్తి, గంటకు 500 పద్యాల వేగ వాక్‌సృష్టి కల్గిన ‘ఆశుకవి చక్రవర్తులు’ కొప్పరపు సోదర కవులు వీరంతా కారణ జన్ములు అద్వితీయులు, విద్వన్మణులు, గనులు, ఘనులు.

జ్ఞాపకాల నీడలలో, ఆ సాహిత్యపు ఊడలలో, ఆ సాంస్కృతీ వాడలలో, నిరంతరం తరంతరం నివసిస్తూ ఉండాలి, ఉందాం, ఉంటాం. "ITALIAN OF THE EAST" అని వారెవరో చెప్పడం కాదు, భారతీయ భాషలలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే రెండవ భాష 'తెలుగు' అని నిర్మాణాత్మకంగా మనమే తెలియజేస్తూ, తెలుగు వారి ఆస్తి అయిన “పద్యాన్ని” కలకాలం స్మరిస్తూ స్వరించుకుందాం.

“తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
 తెలుగు వల్లభుండ తెలుగొకండ!
 ఎల్లనృపులు గొలువ నెరుగవే బాసాడి
 దేశభాషలందు తెలుగులెస్స” అనికదా, ఆర్యవాక్కు!

విధేయతతో,

మా. శర్మ

(మాచవరం వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయశర్మ)

శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు

xxiv