పుట:Kondaveeti Charitramu Maddulapalli Gurubrahmasarma 1907.pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2


      బలవడబద్మయైనతను నాస్తగనుంగొన వైరమంచునీ
      వలపలికన్నుమూయుమని వారిజనాభునివేడునిందిరన్. 4

పార్వతిస్తుతి.



సీ. సతతసంరక్షిత సాధుభక్తకదంబ శోభితానల్పతే జోవిడంబ
    నిరతవామాంకసం దీపిత హేరంబదితిజాతహనన ప్రథితకదంబ
    అబ్జజాండస్థలో కాళిమూలస్తంబ స్మరకేళికాపరి స్ఫురితసాంబ
    సైకతవేదికా సదృశచారునితంబ అధరాధరితసుధా మధురబింబ.

తే-గీ. మందహాసవిలాసాస్య నిందమాన
    సుందరానందకందళి తేందుబింబ
    శంబరారాతిభిన్మన స్సారసావ
    లంబరోలంబశ్రీజగ దంబగొలుతు. 5

సరస్వతిస్తుతి.



చ. తనపతిచెంతజేరి విత తప్రమదప్రదమౌవిపంచికా
    స్వనమలరారరాగముల సస్వరయుక్తిబఠించి మూర్ఛనా
    కనదురుశబ్దగౌరవము గన్పడమేలములన్ బొదల్చునా
    వనరుహయోని రాణిశుక వాణిపురాణి భజింతునిచ్చేలున్. 6

విఘ్నేశ్వరస్తుతి, త్రిప్రాసము.



మ. గణనాధున్ మదగంధలుబ్ధమధుపా క్త్రాంతేభరాడ్వక్త్రుగో
     గణనాధాశ్వతనూజున ప్రతిమ విఘ్నధ్వాంతభానున్ మరు
     ద్గణనాధార్చిత పాదపీఠుశ్రుతివి ద్యావేదితున్ వాతభు
     గ్గణనాధ ప్రథితోపవీతుగొలుతున్ గళ్యాణగర్భస్తుతున్. 7

హనుమస్తుతి.



సీ. తనశైశవహరిత్వమునక లయరుణబిం బంబొకయరుణబింబంబుగాగ
    తనమహాబలగుణో ద్ధతికలతరణి మార్గంబొకతరణి మార్గంబుగాగ
    తనఘనవిస్రంభమునకల సురసజసంభణ మొకసురసజృంభణముగాగ
    తనవచోమృతవర్షమునకలరామమానసమొకరామమానసముగాగ

తే-గీ. నసమకరుణాసుధారస ప్రసరమసృణ