ఈ పుట ఆమోదించబడ్డది

ఆ డ్రైవరు వేగంగా బెంట్లేని పోనిచ్చి తిన్నగా హైకోర్టు జడ్జిగారి భవనంలోకి వెళ్ళినాడు.

మన చెట్టిగారు చూచారు, “వేసిందిరా దిట్టమైన ఎత్తు. అయినా మనంవట్టి వాజమ్మలమా, సూదుము!” అని తన కారు తిన్నగా లోనికి పోనిచ్చినాడు.

పోర్చిలో ముందు ఆపివున్న బెంట్లీ వెనకనే ఈ కారు అపి తను దిగి అక్కడేఉండే చౌకీదారుచే తన విలాసమున్న కార్డు పంపాడు.

6

జడ్జిగారు లోనికి రావలసిందని కబురు పంపారు చెట్టియారు గారికి.

చెట్టియారుగారు లోనికివెళ్ళి, తాను ఒక గొప్ప నాట్య ప్రదర్శనము ఏర్పాటు చేస్తున్నాననీ, అందువల్ల వచ్చేసొమ్ము యుద్ధనిధికి యివ్వదలచుకొన్నాననీ, ఆ ప్రదర్శనానికి గౌరవనీయులైన జడ్జిగారు అధ్యక్షత వహించాలని కోరాడు.

జడ్జిగారికి ఆనందము కలిగి చెట్టియారుగారి కృషికి మెచ్చుకున్నారు.

తాము తప్పక అధ్యక్షత వహిస్తామని ఒప్పుకున్నారు. ఆ సందర్భంలో అనంతలక్ష్మి సంగీతకచ్చేరి కూడా ఉంటుందన్నారు, చెట్టిగారు. అందుకు తాను ప్రయత్నం చేస్తున్నాడట.

జడ్జిగారు: అనంతలక్ష్మి నా మాటంటే ఏదీ తీసివేయదండీ, నేను చెప్పి చూస్తాను.

చెట్టి: చిత్తం, ఆ అమ్మాయి సంగీత కచ్చేరి, భోజనంలో మిఠాయి వంటిదండి.

జడ్జి: అవునవును. నేను విన్నాను. నాకు చాలా యిష్టం ఆమె పాటంటే.

చెట్టి: ఆ అమ్మాయి కష్టపడి, భరతనాట్య గురువులలో నాయకమణి అయిన గోవిందకృష్ణపిళ్ళ దగ్గిర నాట్యం నేర్చుకుందండి. ఆమె నాట్యం ముందు మన దక్షిణాదిన ఎవరు. నిలవగలరండి?

జడ్జి: అలాగా, ఆమె నాట్యం చూడనేలేదు. నాట్యం చేస్తుందనే నాకు తెలియదు!

చెట్టి: అయ్యయో! అద్భుతంగా చేస్తుందండి. నేను ఎన్నిసారులో చూచాను. ఎందుకంటే నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకోదలచుకున్నానండి. ఆ అమ్మాయి అమ్మగారు అంగీకరించారు.

జడ్జి: అద్భుతం! అనందం! మీ చేయి (కరస్పర్శచేయును) ఈలాంటి వివాహాలు జరిగితేగాని - దేశం బాగుపడదండి. ఇక సెలవు.

చెట్టిగారు తన హృదయంమీద అనంతలక్ష్మి వాలినంత అనందంచెంది, నమస్కరించి సెలవుపొంది కారు ఎక్కి కదలి, వీధిలోకి వెళ్ళి ఆ వీధిచివర ఎవరికోసమో చూస్తున్నట్టు ఆపినాడు. అతనికారు ఉన్న స్థలానికి జడ్జిగారి వీధిగేటు కనబడుతుంది.

అంతలో అనంతలక్ష్మి బెంట్లీకారు అతివేగంగా గేటుదాటి అవలివైపుకు పోసాగింది. వెంటనే చెట్టియారుగారి కారు తరిమింది. ముందు బెంట్లీ , వెనుక రోలురాయిస్.

ముందు పావురం వెనుక డేగ, ముందు జింక వెనుక పెద్దపులి, ముందు చిన్నచేప వెనుక సముద్రపు మొసలి.

బెంట్లీ డ్రైవరు ఎన్ని సందులు గొందులు తిప్పాడో ఎన్ని చుట్టుమార్గాలను తీసుకు వెళ్ళాడో చివరకు పన్నెండు గంటలకు బెంట్లీ అనంతలక్ష్మి ఇల్లు చేరింది. అమ్మయ్యా! ఓపికగలవారికే విజయం, పట్టుదల అంటే తనదే పట్టుదల. ఎంత ఎగిరినా పిట్టగూడు