ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 92 కవిత్వతత్త్వ విచారము

                               తే.     యట్లుకా నోచనేల నాకైతి రకట
                                       యనిన నిజావయవంబుల కాత్మవగచు 
                                       బాల్యమునఁ దన్ను రమణ సౌభాగ్యకలిత 
                                       యనిన సాముద్రికుల మాట లరసితిట్టు.”
                                                                                    (ప్రభా. ఆ, 3, ప. 104)
            ಇట్లు అంగములంగూర్చి పలవించుట గఱికలకైనఁ దగునా ? మోహమనఁగా వీరికి దేహక్రీడయే కదా ! ఇదియాశృంగారము ! " అయ్యో ! నాకుచములారా ! మీరు ఆయమ్మను జేరియుండిన సుఖపడుదురుగదా !" యని యెవరైనఁ దలంతురా ! ఆత్మతృప్తి గోరుదురేకాని, యంగాంగములకుఁ బ్రత్యేక సుఖ మున్నదని భ్రమించివాని ప్రారబ్దమునకై విలపించు వారున్నారా? శృంగార ప్రకృతి మన కవులకు నగోచరార్థము. సుఖ మెఱుంగునది మనసు, ఇంద్రియములకు నెఱుక నహి . అవిజ్ఞానము కర్మము మొదలగు క్రియల కుపకరణములు. మనసు ప్రపంచముం దెలిసి కొనుటకు, నిచ్ఛారీతిఁ గార్యముల జేయుటకు ననువైన మార్గములు. వానికి ప్రత్యేకముగ సుఖము ననుభవించు ప్రభావము లేదు.
                           “సీ.      ఓ హంసి ! నిన్ను నేనొక్కటి తుదిమాట
                                                  యడగేద నీహృదయంబు నందుఁ
                                      గలయట్లు చెప్పమీ కల్లలాడిన నీకు
                                                    నాతోడు సుమ్ము ప్రాణసఖీ వీవు 
                                      తడయక ప్రద్యుమ్ను కడకింక నొకమాఱు
                                                      పోయి దుస్తరమైన నా యవస్థ
                                      చెప్పి చేరికఁ గొంత చేయవచ్చునొ రాదొ
                                                        యీ దురాశాపాశ మెందుఁ దెగని
                           తే.       బంధమై ప్రాణముల వెలువడఁగ నీక
                                     యాచcగి పెంచెడు మదనాగ్ని నహరహంబు 
                                     నీవు చని యవగాములు నిశ్చయించి 
                                     యూశఁ దెగఁ గోయుమదియె మత్ర్పాణరక్ష.”
                                                                                        (పభా. ఆ. 3, ప. 107)
                   వరుండు వలచివచ్చిన నుత్తమురాండ్రు సంతసింతురు . ఒడంబడుదురు. ఈ కన్యయో వాఁడు, కరుణ, పశ్చాత్తాపము వీనిమై వచ్చినను జాలుననుచున్నది ? వలపునఁ గూడ బిచ్చమడుగు