ఈ పుటను అచ్చుదిద్దలేదు

76 కవిత్వతత్త్వ విచారము మొత్తముమీఁద విషయమున ప్రబంధసంబంధి గాదు. శైలియం దచ్చటచ్చట నావాసనం దాల్చినదియ. మొత్తముమీఁద ననుటచే నా అవయా శ్వాసముయొక్క యంత్యభాగము మొదలు గ్రంథ సమాప్తి పర్యంతము తుచ్ఛమైన ప్రబంధ ధోరణిలో నే కారణము చేతనో వ్రాయంబడి యుంట సూచితము. సూరనార్యుని రచనా పరిణామముం జూచి రా ! అఖండ శ్లేషపూరితమైన రాఘవ పాండవీయముతో ప్రారంభించి, తుదదా (కు సరికి ప్రభావతి యందు శ్లేష కవిత్వము వచ్చునో రాదో యను నంత తక్కువ పఱచి యున్నాఁడు.

                  సూరన్న యొక్క చిత్రక విత్వము
    భారతము నత్యంతాదరముతోఁ బఠించినవాడయ్యు, కాల దోషంబుచే శబ్దచిత్రములం బ్రకటించుటకు నోర్చిన వాఁడయ్యె ననుటకు నిదర్శనముగఁ గొన్ని పద్యము లుదాహరింతము :

"సీ. విశ్రాంతి విరతిఁ గావింపక సారవ .

                            త్సాహిత్య సౌమనస్యంబు లెఱిఁగి
        సమయంబుఁ దప్పక శ్రవణ కఠోరంబు
                           లైన శబ్దముల నత్యాకులాత్మఁ
       జేయక, సత్పరిచిత సుకుమార వా
                       క్సరళితాభిప్రాయఁగా నొనర్చి
       పరగు శిధిలతఁ బాటిల్లఁగా నీక
                     యేచందములయందు నేమరిలక
తే.     పఱఁగు కవియు దోహ కరుఁడును యశము దు
        గ్దమును బడయు, నట్లు గానినాఁడు
       కృతి దురావ మొదవు కీర్తియుఁ బాలు నీ 
        కుంట గాదు, హాస్యయోగ్యఁ జేయు.”                        (కళా. ఆ. ], ప. 8)
ఇందు శ్లేష ప్రధానము.
  • సీ. క్షేపు దర్పము చివ్వి శీతాంశు రుచి నవ్వి
      పాలమున్నీటిపైఁ గాలు ద్రవ్వి'
                                                                      (కళా. ఆ. 1, ప, 76)

"సీ. మెఱుఁగుటద్దపుమించు మించుబాగులనింపు .

                             నింపచక్కనిముద్దు నెమ్మొగంబు"
                                                                     (కళా. ఆ. 1, ప. 135)