ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము 73 3 నుండిన నసలు దోష మే లేదు చూచితిరా ! ఈ కవి మహిమ ! ఈ సీసము యొక్క సాగసు కథయొక్క పెంపకమునకు ననుకూలము. కవియొడం జెల్లినను జెల్లవచ్చును. చెల్లదన్నను అనిమి త ప సంగము గాదు !

                        ప్రభావతీ ప్రద్యుమ్నము కొన్ని సందర్భముల
                         గళాపూర్ణోదయము ననుక్రమించెడును
     కళాపూర్ణోదయములో భావనాశక్తి య ఖండమన్న నా విజ్ఞప్తికి నిదియొక తార్కాణ. ఒక్క యు ఖండమగుటయు కాదు. కొన్నియెడల మితిని మీ ఆకి యతిశయ దోషముం జెందియున్నదన్నను, గవి యెడ నన్యాయముc జేసినవారము గా ము. ప్రభావతీ ప్రద్యుమ్నము నం దన్ననో కవిత్వవిద్య యింక ను బక్వమునకు వచ్చినది. అనఁ గా శుద్ధరచనను మాత్రము గమనించి చూచిన వెనుక వ్రాయబడిన యీ గ్రంథము దానికిఁ బూర్వమగు కళాపూర్ణోదయమునకన్నఁ గొన్ని విషయముల మిన్న. ఎట్లందు రో, శైలి యింక ను మంచి పాకమునఁ బడియున్నది . లోకోక్తులు మొదలగు నలంకారము లెక్కువ యగుటయు కాదు , రమ్యములును. అన్వయ సౌలభ్యము నధికము కాని భావనాశక్తి యెంతయుc దక్కువ . బహుశః కవి వయసు ముదిరినవాఁడైనందున రాగములు కృశించియుండును. రా గాదుల విజృంభణము లేనిది భావనా శక్తి యడరనేర్చునా? ఏది యెట్లుండె . కళాపూర్ణోదయ సందర్భము అC గొన్నింటిని ప్రభావతీ ప్రద్యుమ్పము లోను అనుకరించి యున్నాఁడు. తొల్లటి గ్రంథమందు (గల నూతన కల్పనలు వెనుకటి దానిలో లేవు. మఱియు నందలి కల్పనలు గొన్ని చిల్లర మార్పులతో నిందు బొందింపబడి యున్నవి. భావనాశక్తి వ్రాలెననుట కింకను సందేహ మేల ? 

చూడు డు, మణికంధరుని తపోభంగముఁ జేయుటకై వచ్చి కార్యసిద్ధి గడించిన రంభ యా మోటు ద పసి శృంగారములకుఁ గరంగని దగుటను, నలకూ బరాయుత్త చిత్త యగుటను, జేసి యొు కా నొకప్పడు

“క . కళలంటి కఱఁచి తన చె

              య్వులఁ జొక్కెడు తపసి మది చివుక్కురుమనఁగ 
              నలకూబర ! విడువిడురా ! 
            యలసితి ననిపల్కె మన్మథాతి వివశతన్.”             (కళా.ఆ. 3, ప. 47)

(10)