ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 67

భావనాశక్తి స్వచ్ఛంద ప్రచారములలో నొకటి. అట్లగుట

దానిని సమగ్రముగఁ దాల్చినకవులకు నదియొక గొప్పవరముగాఁ
దోcపదేమో ! కావున నే కదా మహా కవులును శిల్పులును హను
మంతునివలెC దమ యా న్నత్యమును దా మెఱుంగకుండుట ! కాళి
దాసు వా క్రుచ్చిన విధము నెఱుంగరా ?
                ‘కడుశిక్షితులైనను దమ
                యెడనమ్మిక దమకుఁ గలుగ దెన్నఁడు మదిలోన్ ?)
          వారి క్రే మెూ వారి వాక్కులు సహజములుగ సాధారణము
లుగఁ గాన్పించును. వినువారికన్ననో యాయద్భుతము చెప్పఁ
దరముగాదు ! సూరన యు కళాపూర్ణోదయము తన రచించిన
గ్రంథములలో నుత్త మోత్తమమని యేంచినాఁడో లేదో యనుట
సందిగ్ధము. ఎట్లన : నంద్యాల కృష్ణ విభుఁడు తన్నుద్దేశించి
పల్కినట్లుగా
       “మ.  ఇటమున్గారుడ సంహితాదికృతు లీ వింపాందఁగా బెక్కొన
         ర్చుటవిన్నారము, చెప్పనేలయవి, సంస్తుత్యోభయశ్లేష సం
        పుటనన్ రాపువ పాండవీయ కృతి శక్యంబే రచింపంగ నె
       చ్చట నెవ్వారికి, నీక చెల్లెనది భాషాకావ్యముం జేయఁగన్.”

అని వ్రాసియుండుటయేగాక, రాఘవ పాండవీయములో కృతిపతి

యైన పెద వేంకటాద్రి తన్నుఁ బ్రశంసించుచు
    “శా.  రెండర్ధంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా
           కుండున్, దర్గతి ; గావ్యమెల్ల నగునే నో హెుయనం జేయదే
          పాండిత్యంబున నందునుం దెనుఁగుఁ గబ్బంబద్భుతంబండ్రు, ద
          క్షుం డెవ్వాఁడిల రామభారతకథల్ జోడింప భాషాకృతిన్.”

అని సెలవిచ్చినట్లును వర్ణించియుండుటCజూడ శ్లేష కావ్యములం

గల గౌరవము తదితరముల యెడ నతని కుండెనాయని సంశయింప 

నందు గలదు. కాని రాఘవ పాండవీయ రచనానంతరమున నతఁడు శ్లేష నంతగా వాడక చాలించుటం జూడ దానియందలి

యూ దరము లా ఘవ మయ్యెననియు నూహింపవచ్చును. ద్వ్యర్థి
కావ్యముల కెల్ల శిరోమణి యనందగుదానిని ఘటించినవాఁడయ్యు,
కళాపూర్ణోదయ ప్రభావతీ ప్రద్యుమ్నములలో ప్రబంధకవులవలె
శ్లేష నంతగా వాడక యుంట కతన నదిశక్తిలేమిచే విసర్జింపఁబడినది