ఈ పుటను అచ్చుదిద్దలేదు

38 కవిత్వతత్త్వ విచారము

రెండు, (i) అవి నిర్జీవములట్ల బిఱ్ఱబిగిసి యుండఁగూడదు. (ii) మట్టి తీcగెలవలె నల్లునవిగానున్న నింపును సత్యమును వహించినవగును అనుట. ఇట విన్యసింపఁ దగిన విశేష మింకొండుగలదు. ఏదన, పాత్రముల చరిత్రములు శుద్ధముగ మంచివిగానో శుద్ధముగఁ జెడ్డవిగానో యుండునట్లు దీర్చుట శిల్పదోషములలో నొకటి. ఏలోపమునులోని స్త్రీ పురుషులుండరు. మఱి కేవలము దుష్టులైన మానవులును గంటికిఁ గానరారు. మనుష్యప్రవృత్తి మిశ్రమైనది. కూనీచేసినవాఁడు సైతము పగసాధించుటయను వీరకర్మమున కుద్యోగించు వాడేకదా ! దొంగలు పరుల సొత్తును గ్రహించినను తమ భార్యలయు బిడ్డలయుఁ బోషణార్ధమేకదా ! ఇంతేకాదు. వెలుతురు చాయయు నెట్లు నెడతెగని సంయోగముం దాల్చి యున్నవో, యట్లే మంచి గుణములకును, దమ నీడలోయను మాడ్కి నవియే యాధారముగఁ బ్రభవించెడు చెడుగుణములు సదా సహచరములైయుండును. ధైర్యము మంచిద. అయిన నభిమన్యునివలె నత్యంత సాహసోదగ్రులైనయెడ వ్యర్థమైన ప్రాణ నీష్టికి మూలమగును. ఇఁక నెదిరిని దమ్మును నెఱింగి సమయము పొంచి మీఁదఁబడుదమనువాఁడు జయము గొన్నవాఁడైనను అంత కడింది మగఁడుగఁ దోcపఁడు. నీతియనునది శకునికైతపము యొక్క యపరావతారము. నీతిరహితమైన విజృంభణము ఆశ్చర్య కరమైనను, ఆనందకరమవునో కాదో, మఱియు సుగుణములే కొన్ని యెడలఁ బరస్పర విరుద్ధములగుటయు సంభవించెడు. అపుడేదేనొక న్యాయమును నిరాకరించుట విధిలేని యకృత్యము. దృష్టాంతము కర్ణపర్వమునఁ గృష్ణుఁడు చెప్పిన "కౌశికోపాఖ్యా నము" సత్యము ధర్మమే అయినను దొంగలువచ్చి నీసొత్తెక్కడనని యడిగిన నిజము చెప్పవలయునా ? శత్రువులువచ్చి నీయింటఁ జొచ్చినవాఁ డెక్కడ నున్నాడు చూపుమా వాని గొంతుగోయ వలయును. అని మర్యాదగాc బ్రార్ధించిరేని నిజముచెప్పిన భూతదయ నశించును. కనికరము నుద్ధరించిన ననృత దోషము ఘటిల్లును. అట్లగుటఁ గేవలము నిరంజనుఁడుగా నుండవలయు నన్న నసాధ్యము. నిరంజనత, నిర్వికారత, నిష్కళంకత ఇత్యాద్య భావములు మానవ ప్రకృతికిం జేరినవికావు. మన నడతలు మిశ్రములు. ఈ న్యాయమునకు ననుకూలమైనరీతిని పాత్రముల చరిత్రములం జేర్చి విస్తరించుటలో భారతమునకు నీడుజోడైన గ్రంథము లెవ్వియునులేవు. సామాన్య కవుల పాత్రములు