ఈ పుటను అచ్చుదిద్దలేదు

£8 కవిత్వతత్త్వ విచారము క్లేశాది భావములున్నవి. వస్తువులు, వృత్తములు, చర్యలు ఇత్యాది ప్రకృతులకును మానవ మనః ప్రకృతికిని స్వచ్ఛందముగనుండు భావవిషయమైన రీతులను వర్ణించుట కవితయైుక్క ప్రథమ గణ్యో ధేశము. ఈ కార్యమునకు, సాదృశ్యనిరూపణాద్యలంకారములు సులభముగఁ దోడ్పడిన వలదన రాదు గాని, ಯುಟ್ಲಿ యలం కారములు లేకున్న వర్ణనము తుదముట్టనేరదని భ్రమించి, వానిని కుయుక్తి యను త్రాటిచే బంధించి ప్రబంధమను చెఱలోను C చుట యెంతయు c బశ్చాత్తాపకరమైన నేరము. కమలముతోఁ బోల్చకున్న సీతాదేవి ముఖము చూచువారికి సుఖమియ్యదా ? చిన్నతనముఁ బూ ను నా ? అట్లగుట నాదేవి ముఖము నే నేరుగ వర్ణించినం జాలదా ? మ బ్రియు c గమలముతోఁ బోల్చుటం జేసి సీతాదేవి ముఖ మానందదాయి యాయొనని భ్రమించు వెజ్జు లెవరైననున్న వారికొక ప్రశ్న. ఏమన, ఇఁక దేనితోఁ బోల్పఁబడినందున కమలము హర్షము నొసంగునది యాయెను? ప్రతి పదార్ధమునకు నొక యుపమాన ముండి తీర వలయునన్న కట్టకడపటి యుపమానమున కాధార మేమి? కావున నెట్లును ఏదో యొక వస్తువు తనంత, ఇతర మధ్యస్థ్యములేక, తన కనుగుణమైన భావమును బుట్టఁజేయునుగదా? అట్లగుట మొదటి వస్తువునకే యూ గౌరవము నేల ప్రతిష్టింపరాదు? వస్తుస్వరూపములు చావములు పరస్పర నిర్ణీతములు వస్తువులంబట్టి భావము లేర్పడిన భావములంబట్టి వస్తువు లేర్పడుటయు నిజము. ఎట్లన, సంతోషకాలమున సర్వము ప్రకాశ మానముగాc దోఁచును. దుఃఖము గ్రమ్మినచో లోకమంతయుఁ జీకటిగ్రమ్మిన యట్లుండునుగదా! అభిమన్యుని మరణము విని శోకతప్తయైన సుభద్రాదేవి ప్రలాపించిన యీ పద్యమ వినుండు. సీ. “ఈ లోకమెల్లఁ బాడిల్లును బోలెనై యున్నది నీవు లేకునికిఁ జేసి ! నీవు వేగమ కడు నెఱసి బంధులఁ ಬಿಡೀ - బొందజేయుట కలవోలె నయ్యో, జిష్ణుని కొడుకవ కృష్ణు నల్లుండ వీ వరులచేఁబడుట చోద్యంబుగాదె ! చెలువంపమేనును జెన్ను మొగంబునై యొవ్నడు పొడనూపెదింక గుఱ్ఱ!