ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము 19 నింకొండు ఫలంబు బుట్టదు. కవీశ్వరుల కృతుల నన్యభాషలలో బ్రాచుర్యముం దెచ్చుటకు నా కవీశ్వరులతో సమానమైన ప్రతిభ గల వారికే కాని యలc తులగు లా(త్రివారి క్రేనాఁటి క్ర0జల్లదు 3. పాత్రోచితములైన మాటలం బ్రయోగించియు విషయ మునకుం దగిన రీతిని. సొగసైన వర్ణనములం జేసియు వృత్తములు సాక్షాత్తుగ నెదుటఁ గనులఁగట్టినట్టు చేయుట. ఇది యే యన్నిఁటికిని మించిన కవితాల క్షణము. " కన్నులC గట్టినట్టు కలఁ గాంచిన రూపము ముందు నిల్చినట్లు" ఆకృతులు మనసునకుం దట్టవేని యయ్యది నిక్కమైన కవిత గానేరదు. ఈ మహేంద్రజాల కౌశల్యమున కాధారమైన గుణము భావనాశక్తి.

                                                      భావనాశక్తి

భావనాశక్తి యనంగా విషయముల మనసులోఁ బ్రతిబిం బించునట్లు చేయు సామర్థ్యము. ఒక్క ప్రతిబింబించుట యన నెల !ప్రత్యాక్ష ముగ నవతారమెత్తునట్లు చేయుట. చూడు Cడు. సీత, ద్రౌపది, సావిత్రి, దమయంతి, శూర్పణఖ మొదలగు స్త్రీలు కవి కల్పనమునకుఁ జేరినవారయ్యును మనకుఁ జరిత్రములలోని స్త్రీలకంటెను, మఱియు మనము నిత్యమును జూచుచు వాదాడుచు నున్న యిరుగుపొరుగు భాగ్యశాలినుల కన్నను నెన్నియో మడుం గులు సత్త్వముం దాల్చినవారై స్ఫురించుచున్నారుగదా! చూడం బోయినఁ బాండవులు, దుర్యోధనాదులు, రామభరతులు మొదలగు మనస్సృష్టి మానవులు మిథ్యలా? మన మె మిథ్యలా? ఈ తీరునఁ గృత్రిమముల సంుతము మూర్తీభవింపఁ జేయు వారే మహాకవులు. అట్టివారు వ్యాకరణమునకు భంగము గలిగించిన నేమి ? వచనమున వ్రాసిన నేమి? వారి కే కొదువయు రాఁ బోదు. వ్యాకరణము యతి ప్రాసములు అన్నియుఁ దప్పక కుదిరినను భావనాశక్తి లేని యెడల నట్టి పాండిత్యము జీవము లేని యూ కారము బలె జడంబుగఁ గాన్పించును. ప్రదిమలు వ్రాయుటలో బహుసమర్జుఁడైన యొక శిల్పివర్యునియెడకు, చిల్లరశిల్పి యొకcడు పోయి తన లిఖించిన చిత్రపటముం జూపి, “ దీనియం దేమైన దోషము లున్నవా?" యని ప్రార్ధింపుడు నాతం డిట్లనియె "అయ్యా! గీఁతలు వర్ణములు మొదలగు గుణములన్నియుఁ జక్కగ గుదిరి యున్నవి కాని,యీ సుందర విగ్రహమునకుఁ బ్రాణములే యున్నట్టు గానమే ! " అది విని "ఏ రీతిని దిద్దిన దీనికిఁ జైతన్యముబ్బును తెలుప వేమహాత్మా !"