ఈ పుటను అచ్చుదిద్దలేదు

 తృతీయ భాగము 183

సుకుమారబాహు వల్లికలును రమ్యోరు
                                  కదళికా స్తంభ ప్రకాండములును
                  సులలితాధర బింబఫలవిలాసము పుష్ప
                                  విసర పాండిమహాసవిభ్రమంబు
                  గలిగి పలుకులు శుకపిక కలకలముగఁ
                  గుంతలంబులు మధుకర కులముగాఁగ
                  శంబరా రాతి కేళీవనంబుఁబోలె
                  సుదతి యపుడొప్పె నొక వింత సోయగమున.

                                                                                                (కళా. ఆ, 6, ప. 206)

ఈ సంగతి యీ మాత్రము. ఇఁక నింతలో ఁ గళాపూర్ణుఁడును అభినవ కౌముదీ విహారముల చేతను రాజ కార్యములచేతను మధుర లాల సను మరచినాడ(ట ! అన్ని యద్భుతముల శిశుప్రాయమునన చెప్పిన దానిని, సమీపమున సామంతు నింటఁ బెరుగు దానిని మఱచుటయట ! ఈ మఱపునకుఁ గారణము కళాపూర్ణుని యొక్క బుద్ధిహీనతగాదు, వు ఆలీ కవియొక్క ! ఈ మఱపు రానిచో శాస్త్రీయ మగు హెుయలున కవ కాశ ముండదు. అలంకార క్రమములు వేయకుండినఁ గావ్యము చెడునను భ్రమచేత రాజునకుఁ భ్రమఁ బెట్టినాఁడు ! ఈ చిత్తశోష రాజునది గాదు. శౌస్త్ర విధేయతంబూనిన కవిది.

ఆ మధురలాలసకో యుద్రేకము బలమైనది ! ఉద్రేక లక్షణా లన్చియు మశూచి కాఁక తాకిన లేచు బొబ్బలవలె నంకురించినవి ! మొగము తెల్ల బాఱినది. ఉండు కొంచెము మతియు C బోయినది ! "ఒక్క తెఁ బిల్వఁబోయి మఱియొక్క తెఁ బేర్కొని బిల్చు" నఁట ! “ఒక్కెడ కేగఁజూచి మఱి యొు కె_డ కేగు" నట ! భోజనశాలకుఁ బోవుదమని లేచి పెరటితట్టునకు మఱచినట్లు వెళ్ళునే మో ! పురు పునితో మాటలాడి యుండకపోయినను,

సీ. ఏమి కన్నులఁగన్న హృదయేశు రూపంబు
                           దో (పక యదిమన్ను దోఁపకుండె
                 నేమి వీనుల విన్న హృదయేశు మధురోక్తి
                           తోపక యది మున్ను దోపకుండె,
                                                                                (కళా. ఆ. 6, ప. 214

)

ఈ గారిడీ తంత్రము అమానుషమ ! పైశాచముగావచ్చును ! ఇట్లనేక విధంబు ల రేవగలును జాగ్రత్సుషుపు లC గామవికారముల