ఈ పుటను అచ్చుదిద్దలేదు

156 కవిత్వతత్త్వ విచారము

నేమిటికినైనఁ దా మున్న యేగి యేగి

యెల్లపనుల నొనర్చె నింపెసక మెసఁగ.                                                               96

ఇన్నాళ్ళుC గరగని యూతని మనసు ఈ నవ్య మోహనమూర్తిచే జయింపబడెను !

చ. .........................................................ఆనా బడలిక చూడలే కిడుమపాట్లకుఁజొచ్చి నలంగితంచు నె

క్కుడుతమకంబుతోడ, దలఁగ్రుచ్చి కవంగిటఁగూర్చెనత్తఱిన్.
                                                                  (ప. 99)
      పశుప్రాయమగు శృంగారమునకన్న నిది యెంత మేలు? చూచి
చూడక మునుపే కామినులఁ గవయ నుంకించుట లోలత్వము.
నీచము ! ఇక్కడ, భార్యయెడఁ గూరిమి, ఆ పె తన సహాయమునకై 

స్వయముగా వచ్చినందుకు మెప్ప ? బడలి నందుకు C గనికరము . గొప్పబుద్ధిఁ జూపినందుల కుదారవర్తనయను గౌరవము. ఇట్లు

స్నేహము మర్యాద. వీని కనుకూలములైన భావములతోఁ గలిసిన
శృంగారము చూపCబడియున్నది. ఇది Uశేషము. మానసికము.
శాశ్వతము. పెఱయవి యంగరాగములు. తుచ్ఛములు. చంచల
ములు. మనసుతో  గలసినట్లు కామేచ్ఛ వర్ణించుట మనలో నంతగా
లేదు గాన నీచరిత్రము నవ్యలీలాలలితంబు.

తన మనోరథము ఫలించినందుకు c గారణ మా పెకుఁ దెలియ

దయ్యె. ఎట్లు దెలియును ! కార్యము లనేకములు గణించి పరిశీ

లించినఁ గాని కారణము నేర్పఱుట దుర్లభము. ఒక్క నాఁటి

యనుభవముచే నిర్ధారణ చేయ నశక్యము. అట్లగుట నాఁటి రాత్రి
సుగాత్రి సంతోషముతో " నెప్పటికంటె మిగుల నలంకరించు"కొని
కేళికా భవనమునకు రాcగా "తోఁటపనులు, సేయు మూర్తి మదిన్
హత్తి పాయకునికి" శాలీనుఁడు ఈ ప్రచండ వేషముఁ జూడనైనఁ
జూడక యేదో ధ్యానమున మౌనియై కదలకయుండఁజూచి, భార్య
శోకాశ్చర్య నిమగ్నయై వేచి వేచి విసిగి, 
     ఉ.    ఆ లలితాంగి చాలఁదడవచ్చట నమ్మెయి నుండి సాహసో
            ద్వేలతనంతఁ జేరి కడుఁద్రిమ్మటచే శ్రమ మొంది నారుగా (
            బోలునుబోదునా నిదురఁ బోయెదరే యని కప్పరంపుఁ దాం
            బూలముదావి భుగ్గురని ముంచుకొనం జెవిదండఁ బల్కగన్.