ఈ పుట ఆమోదించబడ్డది



పీఠిక

ఈ కవిత్వతత్త్వవిచార మాంధ్రలోకమునకుఁ జిరపరిచితము గాని క్రొత్తది కాదు. ఆంగ్లవాజ్మయకోవిదులును సుప్రసిద్ధులునగు శ్రీయుత కట్టమంచి రామలింగారెడ్డిగారి యాంధ్రసాహిత్యసారజ్ఞతకు ఫలముగా, క్రీ.శ. } 899 లో, వ్యాసరూపమున నవతరించి సభల మెప్పవడసి 1914లో, వికసించి ప్రకాసించిన యీ కళాపూర్ణోదయ ప్రభావతీ ప్రద్యుమ్న విమర్శనమందలి విషయ మింతకుమున్నే భాషాభిమానులు చక్కగా నెఱిఁగియున్నసు, శ్రీ రెడ్డిగా రుపా ధ్యక్షులుగా నున్నతటి దీని నాంధ్రవిశ్వకళాపరిషత్తునకు సమర్పించి యుండుటచేc బరిషద్వశమున నీ చిన్నపీఠిక వ్రాయవలసివచ్చినది కాని, నిజముగా నిది సిద్ధకథన మే,

పట్టుపట్టి చదువుకొని పండితుఁడైనఁ గావచ్చునుగాని కవి యగుట కష్టము. ఎట్లో శ్రమపడి భాషాంతరీకరించియో యనుక రించియో కవియైనఁ గావచ్చునుగాని విమర్శకుఁడగుట యంత కంటెఁ గష్టము . లోకజ్ఞుఁడై మృదుమధుర భాషలో నొక చక్కని భావమిముడ్చునట్టి కవిదృష్టి యేకాగ్రమైనచో నతని కవిత్వము సరసమై పండిత పామర రంజకమగును గాని లోకజ్ఞుఁడును బహు కవిభావజ్ఞుఁడునై యా కవిత్వమందలి మంచినో చెడ్డనో తెలుప6 బూను విమర్శకుని దృష్టి సర్వతోముఖమైనఁ గాని యతని విమర్శ నము సహృదయరంజకము కానేరదు. కావుననే కవిత్వముకంటె విమర్శనము కష్టతరమనుట. ఇప్లే శాస్త్ర రచనముకంటె శాస్త్ర విమర్శనమును గష్టతరమగును.

సంస్కృతమందు శబరస్వామి శంకరాచార్యాది భాష్యకర్తలు స్వమతస్థాపనమునకై వివిధ శాస్త్రమతము లాకర్షించి కావించిన వివిధ విమర్శనములును, ఔచిత్యవిచారచర్చా కావ్యప్రకాశరస గంగాధ రాది లక్షణ గ్రంథములందు క్షేమేంద్రమమ్మటభట్ట జగన్నాథ పండితరాజాదులు బహుగతులఁ గావించిన కథా రస పాత్రాది విమర్శనములును, విద్వజ్జనరంజకములై వెలయుచున్నను, వారి వారి మతాభిమాన పాండిత్యవిశేషాదులను బట్టి వాని త్రోవలు వేఱు గాఁ గనఁబడుటచే విమర్శనమున కొక నిర్దిష్టమైన పద్ధతి లేదనియు, అట్లుండుట సాధ్యము కూడఁ గాదనియు C దెలియు వచ్చును. కావున విమర్శనము విమర్శకుని చిత్తవృత్తి ననుసరించి