ఈ పుటను అచ్చుదిద్దలేదు

150 కవిత్వతత్త్వ విచారము లోకములో నుండరనుట కిదియొక తార్కాణము. సనాతన ధర్మ

గ్రస్త మీదేశము ! ఐరోపా వారు తఱుచు హేతువాదులు. పరమ0
గూర్చి పెదవుల చేటుగా జపించువారము మనము, ఇహమునం 

దాసక్తులు వారు. అట్టండియు నాజనములలో నుండునంత

యింద్రియ నిగ్రహ మిక్కడ నున్నదనుటకుఁ గాదు.
     ఈ సల్యాసురుఁడు ప్రబంధనాయకులకన్న నిస్సంశయముగ
మేలైనవాఁడు. మృగేంద్రవాహనా శక్తి యిచ్చిన య మోఘమగు 

కత్తిందాల్చి మణికంధరుని నరయుటకై పోవు నభినవ కౌముదిం

గాంచి, తన్నే చంపుటకు వచ్చుచున్నదో ! అట్లైనం దన్నుం జంపు
వారు చత్తురను నమ్మహాశక్తి వరమున్నదిగదా ! అట్లగుట నా పె
నాశమొందునో యని, తన పాటూమాచి, ప్రియు రాలి శుభాశుభ
ములం దల పోయుచు నా సాధు,
 చ, • • • • • • • • ...నంభ్రమించుచున్
మతిగలఁగంగనిట్లనియె నాపయి వచ్చిన నీకు నిష్టదై
వతముల యాననుమ్ము ! వరవర్టిని ! యెందుఁదలంక నేను  దు
ర్మతినయి నీవు నాకుఁదెగి వ్రుగైదవో యని తల్లడిల్లెదన్ !

సీ. అనుడు నయ్యింతి యోయసురేంద్ర నీవు నా

                  హానికి నోర్వ కిట్లాన లిడఁగ
 నకట నీమీఁద రానంత యెఱుంగని
               దాననే యేను నీ తలఁపు బడిన
నడిచెద నని తన్నుఁ గడచి చనంగఁ ద
                 ద్వాక్యరీతి నిజాభివాంఛితమున
కనుకూలమైన యట్టె తోఁచుటయు నతఁ
               డక్కన్య వెనువెంట నంత నంత

నరిగె నెందును నిలువక యజ్ఞముఖియు మిగుల నెడఁబాయ కొక్కొక్క మిషముతోడ నప్పటప్పటి కొక్కింత యూలసించి కూడనిచ్చుచు నెలయించికొనుచుఁ జనియె.

                                                (కళా, ఆ. 6, ప. 62–63)

నమ్మినవాఁడు కవుడులేని మానిసి ! వానిని మోసగించుట యేమికష్టము ! ఆ యప్సరసయందును దోషములేదు. ఇష్టములేని

వాఁడు పైఁబడ గమకించిన ద్వేషముఁబూనని స్త్రీలుందు రా ? ఐన
Jక్కటి, వధకు నుత్సహించినను గొంచెము కనికరముఁజూపి

器。