ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ద్వితీయ భాగము 133

మింకను వైశద్యముతో వెలుఁగును. మన ప్రబంధములు తఱుచు కథానాయకుఁడగు రాజు అనునొక్క పాత్రముతో బ్రౌ రబ్లుములు. ఆయననుగూర్చిన య ప్రస్తుతవర్ణనము ముగియటకుఁ ఓట్లునది యొక గంట. పిమ్మట నర్మసచివఁడో యెవఁడో యొకఁడు వచ్చుట, అటు తర్వాత వేఁట వెడలుదు రేమొ. అక్కడనొక సఖీజన పరి వేష్టి తయగు కోమలాంగిని జూచి రాజును విదూషకుఁడును. (నర్మస చివులు విదూషకులుగ నుండుటయు విదూషకులు నర్మసచివులుగ నుండుటయు హిందూ రాజధర్మము గదా !) రెండుగంట లొకరితో నొకరు శ్లేష లు, అతిశయోక్తులు, ఉత్పేక్షలుఁ బేల్చునప్పటికిని බ්ධි దయ్యాలతో నిండిన కావ్యమని దూరముగఁ బాఱవైతుము ! కళాపూర్ణోదయముతో నుపమింపదగినది, మూలము స్కంధము సామాన్యముల యయ్యు, వివిధ గతుల దెసలవ్యాపింప శాఖోప శాఖలు గలిగి కను పండువుగ నుండు మహావృక్షము. సామాన్య ప్రబంధములు , కొలుకులు ఒకదాని వెంట నింకొకటి యతికించు టచే నేర్పడిన గొలుసులవంటివి. ఐక్యము వీనిలో లేదు. కొలుకులైనఁ జేర్చవచ్చును. ఎన్నియైనఁ దీసివేయవచ్చును. వైపుల్యము దక్క నింకెద్దానికిని లాభనష్టము లుండవు. ఆకృతి మా అదు. వృక్షములు మొదలగు సజీవములవలె నుండు కావ్య ముల నేయంగమునైన ఛేదించుటకుఁగాదు. నూతనాంగములఁ జేర్చుటకుcగాదు. చేసినను పరిమాణ భేదమే గాదు. ఆ కార మును వికృతమగును. ఐక్యమను కథా లక్షణమును బరీ క్షించు పద్ధతి యేదనఁగా, ఉన్న భాగములఁ దీసివేయవచ్చునా క్రొత్తవి యే వైనఁ జేరవచ్చునా యుని విమర్శించుట. ఈ కార్యములు పొ సఁ గనివైన నైక్యము స్ఫుటము, సాధ్యములైన నైక్యభావ మపక్వము.

'మానవ ప్రకృతిని అద్దము వలెఁ జూపు శక్తిగలవాఁడు సంభా షణలC దీర్చుటలో ఁ దిక్కన్నకు సరివచ్చువాడును" అని సూర నార్యుని ప్రశంసించినందుకు దార్కాణమైన ముఖ్యభాగములలో ఁ గొన్ని యే వనంగా యిరువురు రంభలు నలకూబరులును బ్ర వేశించి చిత్రవిచితగతులఁ బొరఁబాటుతో సంచరించియు నే యనుచితము లకు ననీప్సితములకును బాల్వడక కృతార్థులగు తృతీయ చతుర్ధా శ్వాసములోని ఘట్టములు.

           సూరన్నయు షేక్స్పియరును ఒకరి పేరొక రెఱుంగనైనఁ జాఅనియంత దవ్వలనున్న సమకాలీనులు. జాతిమత వేషభాషాదుల