ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయ భాగము 123 కళాపూర్ణోదయమునఁ గార్యక్రమము ముఖ్యపద్ధతి కాలక్రమముంబట్టి చూచిన నీ కథకు నాదిమ భాగము పంచ మాశ్వాసములోని సరస్వతీ చతుర్ముఖుల లీలా కేళి. ఆ నఁగా సామాన్య కవులు వ్రాసియుండినఁ బంచమాశ్వాసము ప్రథమా శ్వాసమై యుండును. చూచితిరా ! ఈ కవియొక్క కూర్పులోఁ గథా ప్రారంభమునకుఁ గావ్యప్రారంభమునకు నెంతదవ్వో ! ఇట3 దూరస్థములీయ్యు నల్లిక చెదరక జిగిబిగిగా నున్నందున నియ్యవీ గాడా శ్లేషముం గాంచియున్నవి. కథ పూర్తిగాఁ దెలియుటకు నై దాశ్వా సములు చదివి తీరవలయు. ఇఁక కథ నెఱుంగవలెనన్న కుతూహల మన్ననో ప్రథ మూ శ్వాసములోనే యంకురితము! "రంభానలకూబరుల వలనఁ గడపట వినంబడిన వాక్యంబొక్కటిఁ దలంచి కొని కృతాం జలియై" కల భాషి ఇది నారదునితో c దా విన ప్రకారం బు నీరీ తి విన్నవించుచున్నది .

సీ. ......................................
    ఏను వృథాబ్రాంతి నింతనంతను దాని
                 వెంబడిఁ జని పల్కు వింటినొకటి
     వినుఁడది, యర్దేశతనయుఁడో యబల ! యి
                  న్నారదు మాటలు నడుమవేఱ

     తే. పొడమె నేమయ్యెనల “కళాపూర్డుసుద్ధి"
        కడమచెప్పమన్న రంభ యప్పడ తెలుపనె
        నీకు మరి చెప్పరాకుంట నీ కథయును
         నీకు నాతోడు నుమ్మబ్బ నీకు మనియో.
                                                  (కళా. ఆ. I, ప. 191)

             ఇధియే కళాపూర్ణునింగూర్చిన తొలుతటి ప్రస్తావన. ఔత్సు క్యముఁ బ్రేరేచు విధములు చూడుడు. రంభ తన ప్రియు నికి నైనఁ జెప్పరానికథ యెట్టిది? ఏ కారణముచేత నా మె మౌనధారిణియా యొ? నను మొదలగు ప్రశ్నలు తమంతట నావిర్భవించి, సమాధానము తెలియు వ అకుc గథ నుండి మరలC గన్నెత్తనీక చేయును. కావ్య ములలోని యే క్రీభావ మనఁబడు గుణంబదియ. అనఁగాఁ నొక పట్టున, నొక గ్రుక్కగా సర్వముఁ గ్రోల మేని దనివినీయమి. భాగ భాగముగఁ జదువఁబోయినఁ దృప్తిలేదు. ఏలన, సమాప్తివ అకు