ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమ భాగము 107

చ. తడవులఁ బట్టియేము సతతంబును బోదుము వాని వీటికిన్
గడుమతి చాలమిం గడుపు గక్కుణితి న్సురలోకనాథ

(ప్రభా. ఆ. 1, ప. 118)

అని శుచిముఖి యింద్రునితో నివేదించి యతని కొఅకై వేగుపని నడపుట కొప్పకొన్నది. కావున "మాయాఘనుఁడు రతీశ్వరుండు" భద్ర వేషముఁ దాల్చినది చూడఁగా "గోటితోఁ బోవుదానికి గొడ్డలి తెచ్చినట్లు !" సునాభుని తనయులకు నీప్సితసిద్ధికిఁ గారణము చిలుక రాయబారము. ఇంతే కాదు. వజ్రనాభుఁడు ప్రాణములతో నుండఁగానే

"శా. ... ••• ••• ••• ••• ••• ... ... ... సంగ్రామవృ
 త్తాంతంబుల్ విని తార్జ్య వాహనుఁడు చక్రాద్యాయుధ ప్రోల్లన
త్కాంతిక్రాంతదిగంతరుండయి వడిన్ దావచ్చె నచ్చోటికిన్.

(ప్రభా. ఆ. 6, ప. 212)

సమూ రాధనకు బ్రాహ్మణులవలెఁ దండోపతండములుగా నింకెందఱు వచ్చిరో ఇఁక వజ్రనాభుని పురమన్ననో "తపమున బ్రహ్మC బ్రసన్నుఁజేసి, మేరువు పొంత మారుతా తపములకు న్నిజాను మతిఁ దక్కC బ్ర వేశ మొనర్చరానిది" గా నతనిచే నిర్మింపఁ బడినది ! అనుమతిలేక కృష్ణుఁ డిప్పుడు చొచ్చినట్లు ఇCక గొంత ముందుగా వచ్చియుండిన నెవరైనఁ దలఁ దీసియుందురా ? విష్ణువు యొక్క మహాత్మ్యమున కతిశయము c గల్పఁబోయి, బ్రహ్మ సంకల్పమునకు కథాకల్పనమునకును విచ్ఛేదముఁ దెచ్చి పెట్టి కొని యుండుట మంచిబేరము గాదు. మఱియు ప్రభావతియొక్క గది నుండి తన విడిది వఱకు రాకపోకలు నిర్విఘ్నముగ నెఅ వేఱుటకై ప్రద్యుమ్నుఁడు భూవివరమొకటి గల్పించెనఁట ! ఇదియు నిరర్ధక శ్రమము. కాకి, పిల్లి, ఎలుక ఇత్యాది గృహజంతువుల రూపముం దాల్చి యథేచ్ఛముగ నేల సంచరింపరాదు ? ఈ కావ్యములో నొక్క కామము చేతనే గాదు, ఊరకయు నిట్టి చిత్ర భ్రమ లప్ప డప్పడు గల్గుచుండున ఈ గ్రంథములో జాతీయములు లోకోక్తులును విశేషముగా వాడఁబడియున్నవి. సంఖ్యయందకాక గుణమునందును నవి గొప్పలు. కాని అతికిఁబోయిన నెగ్గు తప్ప' దనుట నీరీతి శైలి నుండియుఁ జూపవచ్చును. ఈ యుపమానముం జూడుఁడు ! ప్రభావతీ దేవియొక్క సౌందర్యమును ప్రద్యుమ్నునికి